Home » Entertainment » Thaman Give Strong Counter To Netigens
Entertainment

Thaman : తనను ట్రోల్లింగ్ చేసేవాళ్లకి దిమ్మతిరిగిపోయే ఆన్సర్ ఇచ్చిన థమన్..!

Authored By
aruna
The Telugu News | Published on: July 11, 2023, 9:10 pm
Advertisement

Thaman : టాలీవుడ్ టాప్ సంగీత దర్శకులలో ఒకరైనా ఎస్.ఎస్ థమన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు దేవిశ్రీప్రసాద్ కి ఎంత క్రేజ్ ఉందో ఇప్పుడు తమన్ కి కూడా అంతే క్రేజ్ ఏర్పడింది. స్టార్ హీరోలంతా తమ సినిమాకి తమన్ మ్యూజిక్ కావాలి ని క్యూ కడుతున్నారు. ఇటీవల తమన్ మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘ సినిమా నుంచి తప్పుకున్నాడు అని సమాచారం. అయితే గత కొద్ది రోజులుగా తమ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవుతున్నారు. దీంతో ఆయన నెటిజన్స్ కి ఘాటు కౌంటర్ ఇచ్చారు. చిన్నప్పుడే చదువును వదిలేసి సంగీతమే తన ప్రపంచంగా బ్రతికిన తమన్ కి

Advertisement

జీవితంలో సంగీతం కాకుండా మరో ఇష్టమైన ప్రపంచం ఉందని తెలుస్తుంది. అది లేకుండా తను అస్సలు ఉండలేడట. తమన్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ క్రికెట్ జరిగిన తమన్ అక్కడ వాలిపోతాడు. తనకు క్రికెట్ అంటే అంత పిచ్చి. ఇటీవలే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో థమన్ చేసిన హడావుడి బాగా పాపులర్ అయింది. లావుగా ఉన్నప్పటికీ తనదైన స్టయిల్లో అలరించాడు. అయితే ఆ తర్వాత తరచూ థమన్ క్రికెట్ ఆడుతూ కనిపించేవాడు. ఒక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలకు సైన్ చేసి ఇలా సరదాగా క్రికెట్ ఆడతాడేంటి అని థమన్ మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ బాగా విమర్శిస్తున్నారు.

Thaman give strong counter to netigens

Advertisement

అంతే కాకుండా త్రివిక్రమ్ తో మహేష్ బాబు చేయబోయే సినిమా నుంచి కూడా ఈ కారణంగానే తప్పుకున్నాడని విమర్శించారు. దీనికి తమన్ ఘాటుగా రిప్లై ఇస్తూ నాకు అమ్మాయిల అలవాటు లేదు. నేను మందు కొట్టను, నాకు ఇష్టమైన క్రికెట్ మాత్రమే నాకు సంతోషాన్నిస్తుంది. ఎప్పుడు సమయం దొరికినా నా ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడతాను. క్రికెట్ నాకు టైం పాస్ కాదు. అదొక ఎమోషన్. ప్రతి రోజు నైట్ క్రికెట్ ఆడుకొని వచ్చి 2 గంటలకు ఇంటికి వచ్చి స్నానం చేసి నిద్రపోతాను. అంతకంటే నాకు బెస్ట్ ఎంటర్టైన్ మెంట్ మరొకటి లేదు. ఈ విషయంలో నేను ఏ గొట్టంగాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఘాటుగా స్పందించాడు.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి