Home » Entertainment » Thats Why Bigg Boss 6 Telugu Is Taking Off So Quickly
Entertainment

Bigg Boss 6 Telugu : బిగ్‌బాస్ సీజన్ 6 ఇంత త్వరగా ఎందుకు తీసుకొస్తున్నారంటే..?

Authored By
mallesh
The Telugu News | Published on: January 10, 2022, 2:30 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బుల్లితెర ఎంటర్మైంట్ బిగ్ బాస్ షో చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ షో నెమ్మదిగా సౌత్ ఇండియా మొత్తం వ్యాపించింది. ప్రస్తుతం ఈ షోకు మంచి డిమాండ్ ఉంది. రేటింగ్స్‌లోనూ చాలా వేగంగా దూసుకుపోతోంది. తెలుగులో డిసెంబర్ 19వ తేదిన బిగ్ బాస్ సీజన్-5 విన్నర్‌ను ప్రకటించారు. సీజన్ -5 ముగింపు నాడే కొత్త సీజన్ మళ్లీ ఎప్పుడు వస్తుందని నిర్వాహకులు ముందే ప్రకటించారు. సాధారణంగా ఒక ఎపిసోడ్ పూర్తయ్యాక మరో ఎపిసోడ్‌కు 9 నెలల సమయం పడుతుంది. కానీ ఈసారి రెండు నెలల గ్యాప్ లోనే తీసుకొచ్చేందుకు యాజమాన్యం సన్నాహాలు మొదలెట్టింది.బిగ్ బాస్ సీజన్ -6ను ఇంత త్వరగా ఎందుకు తీసుకొస్తున్నారనే విషయం పై నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారట.. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి వేగంగా పెరుగుతోంది.

Advertisement

 భవిష్యత్తులో మరోసారి సినిమా షూటింగులు, థియేటర్లపై మరోసారి ఆంక్షలు విధించే ఆస్కారం లేకపోలేదు. ఈ క్రమంలోనే షెడ్యూల్ ప్రీ పోన్ చేసినట్టు బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించి వెతుకులాట ప్రారంభమైంది. అంతేకాకుండా వచ్చే సమ్మర్‌లో ఐపీఎల్ సీజన్‌తో పాటు పలు కొత్త టీవీ షోలు ప్రారంభం కానున్నట్టు సమాచారం. అందుకే స్టార్ మా యాజమాన్యం వేగంగా అడుగులు వేస్తోంది. ఈసారి బిగ్‌బాస్ షో ఎలాంటి ఎడిటింగులు లేకుండా 24 గంటలు ప్రసారం చేయనున్నట్టు బిగ్ బాస్ ముందే ప్రకటించాడు.

thats why bigg boss 6 Telugu is taking off so quickly

Advertisement

Bigg Boss 6 Telugu :  స్టార్ మా స్కెచ్ మాములుగా లేదుగా..

సీజన్ -6లో ఈసారి కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న వారికే ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలిసింది. సీజన్ -5 టాప్ ఐదుగురిలో ఒకరైన సిరి హన్మంతు బాయ్ ఫ్రెండ్ శీహన్ష్‌ను కంటెస్టెంట్‌గా సెలెక్ట్ చేసినట్టు జోరుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా అతనికి జోడికి ఓ అమ్మాయిని కూడా చూస్తున్నట్టు తెలుస్తోంది. గత సీజన్‌లో సిరి- షణ్ముక్ చేసిన రచ్చ లాగే సీజన్ -6లో వీరిద్దరితో రచ్చ చేయించి టీఆర్పీ రేటింగ్ పెంచుకునే ప్లాన్‌లో బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఉన్నట్టు తెలుస్తోంది.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి