Home » Entertainment » Thats Why Ketika Sharma Works
Entertainment

Ketika Sharma : కేతిక శర్మ అందుకే పనికొస్తుందా..?

Authored By
vamana sai
The Telugu News | Published on: June 29, 2022, 7:00 pm
Advertisement

Ketika Sharma : టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ సహా మిగతా సినిమా ఇండస్ట్రీలలోనూ హీరోయిన్స్‌ కొందరేమో కథా బలమున్న సినిమాలనే ఎంచుకుంటున్నారు. వీరికి ఉదాహరణగా సాయి పల్లవిని చెప్పుకోవచ్చు. భారీ రెమ్యునరేషన్ ఇస్తామని మేకర్స్ ఆఫర్ చేసినా స్కిన్ షోకు ఒప్పుకోదు. అందాల ఆరబోతకు..లిప్ లాక్స్‌కు ససేమిరా అంటుంది. రష్మిక మందన్న, పూజా హెగ్డే లాంటి కొందరేమో గ్లామర్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిస్తున్నారు. వీరు ఒక లిమిటేషన్స్ దాటి కూడా పర్ఫార్మ్ చేయడానికి రెడీ అవుతున్నారు.

Advertisement

ప్రస్తుతం అన్నీ ఇండస్ట్రీలలోనూ వీరికే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ఇక కీర్తి సురేష్ లాంటి మిడ్ రేంజ్ హీరోయిన్స్‌ది ఒక లెక్క. మితిమీరిన అందాల ఆరబోత కాకుండా ఒక బార్డర్ లైన్ వరకు గ్లామర్‌గా కనిపించడానికి ఒకే అంటున్నారు. ఇలాంటి వారికి కూడా బాగానే అవకాశాలు దక్కుతున్నాయి. ఇక
కొందరు యంగ్ బ్యూటీస్ కెరీర్ ప్రారంభం నుంచి కూడా కేవలం గ్లామర్ పాత్రలకే అనేట్టుగా నిలుస్తున్నారు. వీరికి ఉదాహరణ కేతిక శర్మ. రొమాంటిక్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన యంగ్ బ్యూటీ కేతిక శర్మ. ఈ సినిమా ఫ్లాపయినా కూడా కేతికకు అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో బాగా
పేరొచ్చింది.

That’s why Ketika Sharma works

Advertisement

Ketika Sharma : గ్లామర్ రోల్స్‌కు తప్ప మంచి కథా బలమున్న పాత్రలకు పనికిరాదా..?

ప్రస్తుతం మెగా హీరోతో రంగ రంగ వైభవంగా సినిమాను చేస్తుంది. ఈ సినిమా కూడా రొమాంటిక్ లవ్ స్టోరీగానే తెరకెక్కుతోంది. దీనికంటే ముందు నాగ శౌర్య సినిమాలో హీరోయిన్‌గా నటించింది కేతిక. ఈ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పుడు ఆశలన్నీ త్వరలో రాబోతున్న రంగ
రంగ వైభవంగా సినిమా మీదే పెట్టుకుంది. అయితే, ఇప్పటివరకు చేసిన సినిమాలలో అమ్మడు గ్లామర్ రోల్స్ తప్ప కథా బలమున్న పాత్రల్లో కనిపించలేదు. దాంతో కేతిక శర్మ గ్లామర్ రోల్స్‌కు తప్ప మంచి కథా బలమున్న పాత్రలకు పనికిరాదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి రంగ రంగ వైభవంగా సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తుందో అది తనకు ఎంతవరకు పాపులారిటీ తీసుకువస్తుందో చూడాలి.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి