Oscars: ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలిచేసిన “ది ఎలిఫెంట్ విస్పరర్స్”..!!
Oscars: అమెరికా లాస్ ఏంజెల్స్ లో 95వ ఆస్కార్ పురస్కారాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆస్కార్ రేసులో భారతీయ సినిమాలు ఫైనల్ లిస్ట్ లోకి చేరుకోవడం జరిగింది. ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “RRR”.. “నాటు నాటు” సాంగ్ తో పాటు వివిధ విభాగాలలో ఫైనల్ కి చేరుకున్నాయి. దీనిలో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో “ది ఎలిఫెంట్ విస్పరర్స్” కూడా ఫైనల్ కి చేరుకుంది.
కాగా తాజాగా బెస్ట్ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో “ది ఎలిఫెంట్ విస్పరర్స్” ఆస్కార్ అవార్డు గెలిచేసింది. అడవిలో నివసించే జంట తప్పిపోయిన ఏనుగును పెంచటం. ఆ ఏనుగుతో ఈ జంటకు బలమైన బంధం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ప్రకృతికి మానవ జీవితానికి ఉండే బంధాన్ని.. సాన్నిహిత్యాన్ని సహజ తత్వంలో దర్శకుడు కార్తికి గొన్సాల్వేస్.. అద్భుతంగా చూపించడం జరిగింది. ప్రకృతికి అనుగుణంగా గిరిజనుల ప్రజల జీవితాన్ని అద్భుతంగా.. డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించారు.
ఉత్తమ షార్ట్ ఫిలిం విభాగంలో ఈ సినిమాతో పాటు మరో రష్యన్ డాక్యుమెంటరీ చిత్రం “హలౌట్” కూడా పోటీ పడటం జరిగింది. సముద్రంలో రష్యన్ శాస్త్రవేత్త.. సహజ సంఘటనలను గమనింఛే విధంగా ఈ డాక్యుమెంటరీ చిత్రం తెరకెక్కించారు. అయితే చివరకి ఆస్కార్ అవార్డు మాత్రం “ది ఎలిఫెంట్ విస్పరర్స్”కీ వరించింది.