Roja : అందుకే మనోని రోజా కొడుతుందట.. పరువుతీసేసిన నూకరాజు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Roja : అందుకే మనోని రోజా కొడుతుందట.. పరువుతీసేసిన నూకరాజు

 Authored By sandeep | The Telugu News | Updated on :9 March 2022,4:30 pm

Roja : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌కి కంటెస్టెంట్స్ ఎంత ముఖ్య‌మో, జ‌డ్జెస్ కూడా అంతే ముఖ్య‌మ‌య్యారు. షో మొద‌ట్లో ఈ షోకి నాగ‌బాబు, రోజా జ‌డ్జెస్‌గా ఉండ‌గా కొన్నాళ్లకు నాగ‌బాబు జడ్జ్‌గా త‌ప్పుకున్నాడు. ఆయ‌న స్థానంలో చాలా మందిని ట్రై చేయ‌గా, చివ‌రికి మ‌నో సెట్ అయ్యాడు. ఎక్స్‌ట్రా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో అంటూ గత కొన్నేళ్లుగా బుల్లితెరపై వినోదాలు పంచుతున్నారు. ఈ షో చూసి క్షణం ఆపుకోకుండా నవ్వుకోవడమే తప్ప వేరే ఏదీ తెలియని ప్రేక్షకులను మ‌నో కూడా అల‌రిస్తూనే ఉన్నాడు.

ప్రతి గురువారం, శుక్రవారం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లతో ప్రేక్షకులను నవ్వుల లోకంలో ముంచెత్తుతూ వారి రెగ్యులర్ లైఫ్ టెన్షన్ల నుంచి దూరంగా ఉంచుతూ కాసేపు హాయిగా నవ్వుకునేలా చేస్తుంది.రోజా ఎప్పటినుండో ఈ షో తో అనుబంధం కొనసాగిస్తుండడం వల్ల…. నాగబాబు వెళ్ళిపోయినప్పటికీ, పెద్దగా ఇబ్బంది కలగలేదు. జబర్దస్త్ లోనే చేస్తున్న నటులు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఉన్న నటులు జబర్దస్త్ ను బలంగా నిలబెట్టారు. ఇక మనో సైతం రోజా తో కలిసి బాగానే జెల్ అయినట్టుగా కనబడుతున్నారు. అయితే రోజా త‌న ప‌క్క‌న ఉన్న‌వారి చేయిపై కొట్టి న‌వ్వుతుండ‌డం మ‌నం త‌ర‌చు గ‌మ‌నిస్తూనే ఉన్నాం.

the reason to beat the mano by roja

the reason to beat the mano by roja

Roja : భ‌లే న‌వ్వించారుగా..!

దీనిపై తాజాగా స్కిట్ చేయ‌గా, ఇందులో రోజా పాత్ర పోషిస్తున్న న‌టి మీ చేయి ఏంటి స్టీల్ బాడీలా ఉంది అన‌గా, అది నిజంగానే స్టీల్ బాడీ అని నూక‌రాజు పంచ్ వేశాడు.ఇక రోహిణి అవును రోజా గారు ఊరికే మ‌నోని ఎందుకు కొడుతుంటారు ఎందుకుని అడ‌గ‌గా, అందుకు నూక‌రాజు, రోజా గారు ఎక్స్‌పీరియ‌న్స్ కాబ‌ట్టి ఎక్క‌డ న‌వ్వాలో, న‌వ్వ‌కూడదో ఆమెకు తెలుసు. మనోగారు కొత్త కాబ‌ట్టి ఎక్క‌డ న‌వ్వాలో హింట్ ఇస్తూ కొడుతుంటుంది. మొత్తానికి ఆమ‌ని వారి ప‌ర్‌ఫార్మెన్స్ కి తెగ ఫిదా అవ్వ‌డ‌మే కాక లేచి చ‌ప్ప‌ట్లు కొట్టింది. నిజంగానే కంటెస్టెంట్స్ కూడా అద్భుతంగా పర్‌ఫార్మ్ చేశారు. వీరి స్కిట్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది