Monisha : నడిరోడ్డుపై రక్తపు మడుగులో స్టార్ హీరోయిన్ మృతి.. అనాథగా వదిలేశారేంట్రా..!
Monisha : మళయాల సినిమా చరిత్రలో అదొక పీడకల. అప్పుడే సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతున్న 22 ఏళ్ల టాలెంటెడ్ అమ్మాయిని విధి వంచించింది. సినిమా షూటింగ్‌కు వెళ్తున్న సమయంలో అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ హీరోయిన్ అక్కడికక్కడే మరణించింది. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఆమెను ఎవరైనా ఆస్పత్రికి తరలించి ఉంటే తప్పకుండా బతికేది. కానీ సాటి మనిషి రక్తపు మడుగులో ఉన్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రాణాలతో పోరాడి తుదిశ్వాస విడిచింది. ఆమె మరెవరో కాదు మోనిషా..
మోనిషా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఆమె వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే. తొలి సినిమాలోనే హీరో వినిత్ పక్కన హీరోయిన్‌గా ఎంపికైంది. సినిమా విడుదలయ్యాక అద్భుత కావ్యంగా పేరు తెచ్చుకుంది. లేత ప్రాయంలో విషాద ప్రేమకథగా తెరకెక్కిన ఆ సినిమా అందరి మన్ననలు పొందింది. అయితే, మోనిషా నటించిన తొలిసినిమా నకక్ష తంగల్‌కు ఉత్తమ నటిగా ఆమె జాతీయ పురస్కారం అందుకుంది.దీంతో ఒక్కసారిగా అందరి చూపు మళయాళం సినిమాపై పడింది. ఇదే సినిమాను తమిళంలోనూ రీమేక్ చేయగా అందులోనూ నటించిన మోనిషా.. ఆ తర్వాత తెలుగులో లాయర్ భారతీయ దేవి అనే సినిమాలో నటించింది.
కన్నడలో చిరంజీవి సుధాకర్, మలయాళంలో ఆర్యన్ చిత్రాల్లో చేసింది. ఇలా కేవలం ఆరేళ్లలోనే 18 మళయాల సినిమాలు, 4 తమిళ సినిమాలు, ఒక తెలుగు, ఒక కన్నడ సినిమాలో నటించింది మౌనిష. ఈ క్రమంలోనే ఓ సినిమా షూటింగ్‌కు వెళ్తున్న క్రమంలో యాక్సిడెంట్ అయి మోనిషా తీవ్రగాయాల పాలై మృతి చెందింది. అప్పుడు ఆమె వయస్సు కేవలం 22 ఏళ్లు మాత్రమే.ఆమె తల్లిచిన్న గాయాలతో బయటపడి ప్రాణాలు దక్కించుకుంది.మోనిషా మళయాళ ఇండస్ట్రీని వీడి ఇప్పటికీ 30 యేళ్లు గడిచాయి. అయినా మౌనిషను ఇప్పటికీ గుర్తుచేసుకునే వారు ఉన్నారు. ఆమె చిన్నతనంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించిందని చాలా మంది కొనియాడుతున్నారు.