Samantha : పాపం సమంత.. మంచి చేయకపోతే చెడు ఎదురైంది.. అందరు అలా తిడుతున్నారేంటి?
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. మయోసైటిస్ వలన సినిమాలకి దూరమైన సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కొద్ది రోజులుగా సమంత హెల్త్‌కి సంబంధించిన పలు విషయాలపై కూడా అవగాహన కల్పించే ప్రయత్న చేస్తుంది. అయితే నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్ (పీల్చడం) చెయ్యడం వల్ల ఉపశమనం ఉంటుందని సూచిస్తూ పోస్ట్ షేర్ చేసింది సమంత. దీనిపై డాక్టర్ లివర్ డాక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు సమాచారంతో ప్రజల ఆరోగ్యంతో సమంత ఆటాడుతుందంటూ మండిపడ్డారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని లేదని ఆయన అన్నారు.
సమంత చెప్పినట్టు చేస్తే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఇలాంటి సలహాలు ఇస్తున్న ఆమెను జైళ్లో పెట్టాలంటూ మాటల దాడి చేశారు. ఒక రకంగా సమంతకి వార్నింగ్ ఇచ్చాడు. దీనిపై స్పందించిన సమంత తన డాక్టర్ గైడెన్స్ లో మాత్రమే తను ఇవన్నీ చేశానని చెప్పుకొచ్చింది.తనకు వార్నింగ్ ఇచ్చిన వైద్యుడు.. తన డాక్టర్‌తో చర్చకు వచ్చి ఉంటే గొప్పగా ఉండేదని సమంత అభిప్రాయపడింది. కానీ ఇలా మెసేజ్ చేయడంతో చీప్ అయిపోయాడని ఇండైరెక్ట్ కామెంట్స్ చేసింది. నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని అని సమంత పేర్కొంది.
Samantha : పాపం సమంత.. మంచి చేయకపోతే చెడు ఎదురైంది.. అందరు అలా తిడుతున్నారేంటి?
ఈ క్రమంలో డాక్టర్ లివర్ డాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో నోట్ షేర్ చేస్తూ.. “నేను సమంత ఆరోగ్య పరిస్థితిని అర్థం చేసుకున్నాను. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ఆమె ఆరోగ్యంపై షేర్ చేసిన పోస్ట్‌ను నేను ఖండించాను. ఈ క్రమంలో నేను వాడిని పదజాలం ఆమెకు బాధపెట్టింది. ఇందుకు ఆమెను క్షమాపణలు కోరుతున్నాను. కానీ అవి నేను కావాలని చేసినవి కాదు. అనుకోకుండ అలా జరిగింది. ఆమెను విమర్శించడం నా ఉద్దేశం కాదు. నిజానికి అది సమంత తప్పు కాదు. ఆమెకు ఆ చికిత్స చెప్పిన డాక్టర్‌ది. అతడి సొంత లాభం కోసం సమంత స్టార్ డమ్‌ని ఉపయోగించుకున్నాడు అని డాక్టర్ క్లియర్ కట్‌గా చెప్పుకొచ్చాడు. ఇక సమంతని డాక్టర్‌తో పాటు పూనమ్ కౌర్, గుత్తా జ్వాల వంటి వారు విమర్శిస్తున్నారు. మంచి చేయబోతే సామ్‌కి చెడు ఎదురైందని వారు కామెంట్ చేస్తున్నారు.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.