KCR : గులాబీ బాస్ కేసీఆర్ పది సంవత్సరాల పాటు తెలంగాణని గడగడలాడించారు. ఆయన చెప్పిందే వేదం అన్నట్టు నడిచింది. అయితే ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో మాత్రం ఆ పార్టీ దారుణంగా ఓటమి చవి చూసింది. కాంగ్రెస్ బంపర్ మెజారిటీతో గెలిచింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బీఆర్ఎస్ బాస్ కి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఈ క్రమంలో ఎవరు ఎప్పుడు కారు దిగేస్తారో తెలియని అయోమయ పరిస్థితిలో ఉద్యమ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత రెండు రోజుల పరిణామాలు పరిశీలిస్తే… హైదరాబాద్ రాజకీయంలో ఏదో జరుగుతుందని అందరికి అర్ధమవుతుంది.
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్… బీఆర్ఎస్‌ను ఉక్కిరిబిక్కరి చేస్తోండగా, పార్టీ సమావేశంతోపాటు, గ్రేటర్ హైదరాబాద్ పాలకమండలి సమావేశానికి సైతం ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ ఎమ్మెల్యేల షాక్ తప్పదా? అన్న చర్చ జరుగుతోంది.ఏడు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. హైదరాబాద్ సహా నగర శివారులో ఎంఐఎం, బీఆర్ఎస్ పట్టు నిలుపుకోగా, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. అయితే హస్తం పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గ్రేటర్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన తొలి ఎమ్మెల్యే. దానం తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు కూడా కారు దిగి హస్తం జెండా పట్టుకున్నారు. గ్రేటర్‌లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన కాంగ్రెస్… గులాబీ నేతలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేలా పావులు కదుపుతోంది.
కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మార్రి రాజశేఖర్ రెడ్డి తెలంగాణ భవన్లో జరిగిన సమావేశానికి హాజరుకాలేదు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి గ్రేటర్ పాలక మండలి సమావేశానికి హాజరు కాలేదు. రెండు సమావేశాలకు హాజరుకాని మెజారిటీ ఎమ్మెల్యేల్లో కొందరు నేడో రేపో పార్టీకి గుడ్ బై చెబుతారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వలలో రానున్న రోజులలో ఎంత మంది చిక్కుకుంటారో చూడాలి.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.