Geetu Royal : తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా ప్రేక్షకాదరణను అందుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులోకి ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ షో… సక్సెస్‌ఫుల్‌గా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఆరో సీజన్ జరుపుకుంటుంది. ఈ కార్యక్రమం రోజు రోజుకి ఆసక్తికరంగా సాగుతుంది. ముఖ్యంగా ఎలిమినేషన్ ప్రక్రియ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎవరో ఎలిమినేట్ అవుతారు అనుకుంటే మరెవరో ఎలిమినేట్ అవుతున్నారు. ఆరో సీజన్‌లో ఎలిమినేషన్స్ అన్నీ ఎవరూ ఊహించని విధంగా సాగుతున్నాయి. అందుకే ఇప్పటికే చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్లు బయటకు వెళ్లిపోయారు.
తాజాగా రాయలసీమ భామ గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. ఈ అమ్మడు ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో టైటిల్ ఫేవరెట్ అనిపించుకుని పక్కాగా ముందుకు సాగింది. టైటిల్ బరిలో నిలిచిన గీతూ రాయల్ తొమ్మిదో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఆదివారం ఎపిసోడ్‌లో శ్రీ సత్య, గీతూ రాయల్ మిగిలారు. ఇందులో గీతూ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. దీంతో ఆమెతో పాటు హౌస్‌లోని వాళ్లంతా షాక్‌లో ముగినిపోయారు. గీతూ అయితే కన్నీరు మున్నీరుగా విలపించింది.
these-are-the-reasons-for-geetu-royal-elimination
అయితే గీతూ ఎలిమినేట్ కావడానికి ఇవి ప్రధాన కారణాలు అని తెలుస్తుంది. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఆమె గేమ్ ఆడడం, తాను తెలివిగా ఆడుతుందనుకొని ఇతరుల ఆటని చెడగొట్టడం, అలానే మనుషుల వీక్ పాయింట్స్‌ని పట్టుకొని గేమ్ ఆడుతుండడం వంటివి గీతూకి కాస్త నెగెటివ్‌గా మారాయి. గీతూ కన్నా ఫిజికల్ గేమ్స్ లో బద్దకంగా ఉండేవారు హౌస్ లో ఉన్నారు. తాను ఫిజికల్ ఆడడం లేదు కాబట్టి ఎలాగైనా మైండ్ గేమ్ తో ఇతరులపై పైచేయి సాధించాలి అని గీతూ అనుకుంది. ఆమె ఎలిమినేషన్ కి ఒక కారణంగా మారింది. మొత్తానికి గీతూ ఎలిమినేషన్ అనేది అందరికి ఆశ్చర్యాన్ని కలిగించిందనే చెప్పాలి.
Hanuman phal | రోజూ ఆరోగ్యంగా ఉండేందుకు ఆపిల్, అరటి, ద్రాక్ష వంటి పండ్లు తినాలని అందరూ చెబుతారు. కానీ…
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
This website uses cookies.