Geetu Royal : విన్న‌ర్ కావ‌ల్సిన గీతూ ఎందుకు ఎలిమినేట్ కావల్సి వ‌చ్చిందో తెలుసా.. అస‌లు కార‌ణాలు ఇవి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Geetu Royal : విన్న‌ర్ కావ‌ల్సిన గీతూ ఎందుకు ఎలిమినేట్ కావల్సి వ‌చ్చిందో తెలుసా.. అస‌లు కార‌ణాలు ఇవి..!

Geetu Royal : తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా ప్రేక్షకాదరణను అందుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులోకి ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ షో… సక్సెస్‌ఫుల్‌గా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఆరో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. ఈ కార్య‌క్ర‌మం రోజు రోజుకి ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ముఖ్యంగా ఎలిమినేష‌న్ ప్రక్రియ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఎవ‌రో ఎలిమినేట్ అవుతారు అనుకుంటే మ‌రెవ‌రో ఎలిమినేట్ అవుతున్నారు. ఆరో సీజన్‌లో ఎలిమినేషన్స్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :7 November 2022,3:00 pm

Geetu Royal : తెలుగు బుల్లితెరపై చాలా తక్కువ సమయంలోనే విపరీతంగా ప్రేక్షకాదరణను అందుకున్న షోలలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులోకి ఆరేళ్ల క్రితం వచ్చిన ఈ షో… సక్సెస్‌ఫుల్‌గా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకోగా, ఇప్పుడు ఆరో సీజ‌న్ జ‌రుపుకుంటుంది. ఈ కార్య‌క్ర‌మం రోజు రోజుకి ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. ముఖ్యంగా ఎలిమినేష‌న్ ప్రక్రియ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఎవ‌రో ఎలిమినేట్ అవుతారు అనుకుంటే మ‌రెవ‌రో ఎలిమినేట్ అవుతున్నారు. ఆరో సీజన్‌లో ఎలిమినేషన్స్ అన్నీ ఎవరూ ఊహించని విధంగా సాగుతున్నాయి. అందుకే ఇప్పటికే చాలా మంది స్ట్రాంగ్ ప్లేయర్లు బయటకు వెళ్లిపోయారు.

తాజాగా రాయలసీమ భామ గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. ఈ అమ్మ‌డు ప్రత్యేకమైన శైలితో బాగా హైలైట్ అవుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో టైటిల్ ఫేవరెట్ అనిపించుకుని పక్కాగా ముందుకు సాగింది. టైటిల్ బరిలో నిలిచిన గీతూ రాయల్ తొమ్మిదో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఆదివారం ఎపిసోడ్‌లో శ్రీ సత్య, గీతూ రాయల్ మిగిలారు. ఇందులో గీతూ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. దీంతో ఆమెతో పాటు హౌస్‌లోని వాళ్లంతా షాక్‌లో ముగినిపోయారు. గీతూ అయితే క‌న్నీరు మున్నీరుగా విలపించింది.

these are the reasons for geetu royal elimination

these-are-the-reasons-for-geetu-royal-elimination

Geetu Royal ఎలిమినేష‌న్ కార‌ణం ఇదే..

అయితే గీతూ ఎలిమినేట్ కావ‌డానికి ఇవి ప్ర‌ధాన కార‌ణాలు అని తెలుస్తుంది. క్రీడా స్పూర్తికి విరుద్దంగా ఆమె గేమ్ ఆడ‌డం, తాను తెలివిగా ఆడుతుంద‌నుకొని ఇత‌రుల ఆట‌ని చెడ‌గొట్ట‌డం, అలానే మ‌నుషుల వీక్ పాయింట్స్‌ని ప‌ట్టుకొని గేమ్ ఆడుతుండ‌డం వంటివి గీతూకి కాస్త నెగెటివ్‌గా మారాయి. గీతూ కన్నా ఫిజికల్ గేమ్స్ లో బద్దకంగా ఉండేవారు హౌస్ లో ఉన్నారు. తాను ఫిజికల్ ఆడడం లేదు కాబట్టి ఎలాగైనా మైండ్ గేమ్ తో ఇతరులపై పైచేయి సాధించాలి అని గీతూ అనుకుంది. ఆమె ఎలిమినేషన్ కి ఒక కారణంగా మారింది. మొత్తానికి గీతూ ఎలిమినేష‌న్ అనేది అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌నే చెప్పాలి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది