Home » Entertainment » Trp Trick Varsha Emmanuel Is Being Used Well
Entertainment

Varsha Emmanuel : టిఆర్పి కోసం ఇంత నీచానికి దిగజారుతారా… వర్ష – ఇమ్మానుయేల్ ను బాగా వాడేస్తున్నారుగా….!

Authored By
aruna
The Telugu News | Published on: November 7, 2022, 2:20 pm
Advertisement

Varsha Emmanuel ప్రస్తుత కాలంలో టిఆర్పి కోసం చానల్స్ వారు ఏం చేయడానికైనా ఆలోచించడం లేదు. ఇక తమ టిఆర్పిని పెంచడం కోసం నటీనటుల మధ్య ప్రేమాయణం నడిపిస్తున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన జంట రశ్మి సుధీర్. బుల్లితెర పైన ఈ జంటకు చాలా డిమాండ్ ఉందని చెప్పాలి. అలాగే నిజంగానే వీరిద్దరు లవర్స్ అని చాలామంది అభిప్రాయపడతారు. వీరిద్దరికీ పెళ్లి అయితే కూడా బాగుంటుందని సుధీర్ ఫ్యాన్స్ చాలా ఆశపడ్డారు. కానీ వాళ్లది స్క్రీన్ మీద లవ్ అని, స్క్రీన్ బయట వారి మధ్య అలాంటిదేం లేదని తెలియడంతో అందరూ నోరు మూసుకున్నారు.ఇక జబర్దస్త్ వేదిక గా రష్మీ సుధీర్ తర్వాత మరల అంతటి పాపులారిటీని దక్కించుకున్న జంట ఇమాన్యుయెల్ వర్ష. వీరిద్దరు కూడా స్క్రీన్ పై లవర్స్ లా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు .అలాగే టిఆర్పి రేటింగ్ కోసం ఇప్పటికే వీరికి రెండు మూడు సార్లు పెళ్లిళ్లు కూడా చేశారు .

Advertisement

ఇక చాలాసార్లు వర్షా ఇమాన్యుయల్ పై తనకున్న ఇష్టాన్ని తెలియజేస్తూ వచ్చింది.అయితే వీరిద్దరూ రియల్ లవర్స్ ఆ లేక రైటింగ్ కోసమే నటిస్తున్నారా అనేది కన్ఫామ్ గా లేదు. ఇక వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ను చాలా మంది ఆరాధిస్తున్నారు.ఇది ఇలా ఉండగా ఇటీవల రిలీజ్ అయిన జబర్దస్త్ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నవంబర్ 11న ప్రచారం కాబోయే ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో కృష్ణ భగవాన్ మరియు పోసాని కృష్ణ మురళి జడ్జిలుగా విచ్చేశారు. ఈ క్రమంలో పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ … వర్ష ఇమ్మానుయేల్ నిజంగా లవర్స్ ఆ అని అడిగాడు. దానికి ఇమ్మానుయేల్ ఆ విషయం ఆ అమ్మాయే చెప్పాలి సార్ … తను నిజంగానే ప్రేమిస్తున్నానంటే ఇప్పుడే తాళి కట్టేస్తా అని అన్నాడు.

TRP trick Varsha emmanuel is being used well

Advertisement

ఇక పోసాని కృష్ణ మురళి స్టేజ్ మీదకు వచ్చి అమ్మాయికి ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ నీ నిజాయితీ నాకు బాగా నచ్చింది అని అన్నాడు. అందుకు ఇమ్మానుయేల్ థాంక్స్ సార్.. మీరు ఓకే అంటే దాన్ని సైడ్ చేసి మనం పెళ్లి చేసుకుందాం సార్ అని అన్నాడు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత గెటప్ శీను తాళి పట్టుకొని వచ్చి రెండు పీటలు వేసి ఇమాన్యుయెల్ వర్షాకు వివాహం చేసేందుకుు సిద్ధమవుతాడు. ఇమ్ము వర్ష ఆశ్చర్యంతో చూస్తుండగానే వారిద్దరిని ఒక దగ్గరికి చేర్చి ఇమాన్యుయెల్ చేతికి తాళిని ఇస్తాడు. వర్ష మెడలో తాళి కట్టేందుకు ఇమాన్యుయల్ ఎదురు వెళ్తుండగా ప్రోమో ముగిసిపోయింది. అయితే తాళిని నిజంగానే కట్టాడా లేదా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ ప్రసారం అయ్యేంతవరకు వేచి చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి