మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే మహేష్ బాబు నటించే మూడు సినిమాలు ఇవే అని సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత పెద్ద గ్యాప్ లేకుండానే మహేష్ బాబు రెండు భారీ మల్టీస్టారర్ సినిమాలతో పాటు ఒక భారీ కమర్షియల్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చాయి.
వాటిలో ఒక సినిమా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఆచార్య సినిమా కాగా మరొక సినిమా బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 కి సీక్వెల్ ఎఫ్3. అలాగే మహర్షి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కే సినిమా. అయితే వంశీ పైడిపల్లి సినిమా ఇక రేపో మాపో సెట్స్ మీదకి రాబోతుందనగా అనూహ్యంగా మహేష్ బాబు వంశీ పైడిపల్లి సినిమాకి నో చెప్పి షాకిచ్చాడు. అందుకు కారణం వంశీపైడిపల్లి చెప్పిన పాయింట్ బావున్నప్పటికీ .. ఆ పాయింట్ పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా తయారు చేసి నెరేట్ చేస్తే మహేష్ కి నచ్చకపోవడం.
ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్ తో కలిసి మహేష్ బాబు నటించేందుకు ఒకే చెప్పాడని .. అందుకు గాను మహేష్ అందుకునే రెమ్యూనరేషన్ 40 కోట్ల ని వార్తలు వచ్చాయి. కాని కరోనా కారణంగా మేకర్స్ బడ్జెట్ పరంగా తీసుకున్న నిర్ణయం వల్ల మహేష్ ఆచార్య నుంచి డ్రాపయ్యాడని సమాచారం. అలాగే అనిల్ రావిపూడి తాజాగా మొదలు పెట్టిన ఎఫ్ 3 విషయంలో కూడా ఇలా రెమ్యూనరేషన్ కి.. బడ్జెట్ కి సంబంధించిన విషయాల వల్లనే మహేష్ డ్రాపయ్యాడని అంటున్నారు. మొత్తానికి కరోనా వల్ల ఇండస్ట్రీలో చోటు చేసుకున్న తీవ్ర పరిణామాల వల్ల ఆచార్య, తో పాటు ఎఫ్ 3 సినిమాలు మిస్సయ్యాడని తెలుస్తోంది.
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించన తమ్ముడు జూలై 4న విడుదల కానుంది. ఈ మూవీ…
Jio Recharge : జియో వినియోగదారుల కోసం అద్భుతమైన ఐడియల్ రీఛార్జ్ ప్లాన్ల ను ప్రకటించింది. ప్రస్తుతం, చాలా మంది…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
This website uses cookies.