థమన్ సంగీతమందించిన అల వైకుంఠపురములో సినిమా సాంగ్స్ పరంగా ఎంతటి సంచలనం సృష్ఠించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి థమన్ మ్యూజిక్ కి సగం క్రెడిట్ ఇవ్వొచ్చన్న ప్రశంసలు అందుకున్నాడు థమన్. అంతేకాదు థమన్ కూడా ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకున్నాడు. సినిమా లో సాంగ్స్ ఇంత పెద్ద హిట్ అయ్యాయంటే దాని వెనక థమన్ చాలా కష్టపడ్డాడు అని దర్శకుడు త్రివిక్రం తో పాటు అల్లు అర్జున్ కూడా ఓపెన్ గా ఒప్పుకున్నారు. దాంతో థమన్ కి టాలీవుడ్ లో విపరీతంగా క్రేజ్ పెరిగింది.
దాదాపు ఏ హీరో సినిమా అయినా మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ నే ఎంచుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ కి థమన్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి రిలీజైన మగువా మగువా సాంగ్ ప్రతీ ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకొని ట్రెండింగ్ లో నిలిచింది. అలాగే రవితేజ క్రాక్ సినిమాకి థమన్ సాంగ్స్ చాలా ప్లస్ కానున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆర్జీవీ అప్సరా రాణి రవితేజ మీద జానీ మాస్టర్ నేతృత్వంలో కంపోజ్ చేసిన భూం బద్దల్ అన్న స్పెషల్ సాంగ్ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది.
కాగా ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు – కీర్తి సురేష్ జంటగా నటించబోతున్న సర్కారు వారి పాట సినిమాకి థమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా కోసం థమన్ 10 కొత్త రకమైన ట్యూన్స్ రెడీ చేసినట్టు లేటెస్ట్ న్యూస్. త్వరలో ఈ ట్యూన్స్ మహేష్ బాబు కి దర్శకుడు పరశురాం కి వినిపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం 10 ట్యూన్స్ రెడీ చేసిందాని కంటే ఆ 10 లో ఎన్ని కాపీ ట్యూన్స్ ఉన్నాయో అని భయపడుతున్నారట. కారణం ఈ మధ్య థమన్ మీద కాపీ ట్యూన్ అని నెటిజన్స్ విపరీతంగా ట్రోల్స్ చేయడమే. మరి థమన్ ఈ సినిమాకి ఎలాంటి ట్యూన్స్ రెడీ చేశాడో చూడాలి. కాగా సర్కారు వారి పాట సినిమాకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు.
Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…
Telangana | తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…
Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
This website uses cookies.