Nayanthara : సినీ పరిశ్రమలో చాలామంది సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారు. ఆడవాళ్లకు తల్లి అవడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి అని అంటుంటారు. చాలామంది కూడా తమ జీవితంలో ఏదైనా గుర్తుండిపోయే క్షణాలు ఏవి అంటే వాటిలో తల్లి అవడం అని కచ్చితంగా చెప్తారు. హీరోయిన్ల విషయంలో కూడా ఇలానే ఉంటుంది. చాలామంది హీరోయిన్ లు పిల్లల్ని కన్నారు కొంతమంది సహజంగా కన్నా మరి కొంతమంది మాత్రం సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. ఇండస్ట్రీలో చాలామంది సరోగసి ద్వారా పిల్లల్ని కన్న నటులు ఉన్నారు. ఇటీవల నయనతార కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఈమె సహజంగా పిల్లల్ని కనకుండా సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది. నయనతార మాత్రమే కాదు ఇండస్ట్రీలో చాలామంది సరోగసి పద్ధతిని ఎంచుకొని పిల్లల్ని కన్నారు. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఈమె కూడా సరోగసి పద్ధతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చింది. అలాగే బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నట్టు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అలాగే మరో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నట్లు తెలుస్తుంది. బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ గౌరీ దంపతులు కూడా మూడవ సంతానం కోసం సరోగతి పద్ధతిని ఎంచుకున్నారు.
అలాగే అమీర్ ఖాన్ కిరణ్ రావు దంపతులు కూడా సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. అలాగే శిల్పా శెట్టి దంపతులు కూడా సరోగసి ద్వారా పాప పుట్టినట్లు ప్రకటించారు. ఇక సన్నీలియోన్ దంపతులు కూడా సరోగసి ద్వారా బిడ్డకు జన్మనిచ్చారు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ కూడా సరోగసి ద్వారా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. బాలీవుడ్ డైరెక్టర్ , ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కన్నారు. అలాగే ప్రముఖ నటుడు తుషార్ కపూర్ కూడా సరోగసి పద్ధతితో ఓ బాబుకు జన్మనిచ్చారు. ఇలా వీళ్లంతా అద్దె గర్భంతో పిల్లల్ని కన్నవాళ్లే.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.