Chatrapathi Villain Pradeep Rawat and His Wife Latest Visuals at Hansa Singh
Chatrapathi Villain Wife : ఛత్రపతి సినిమా చూశారా మీరు. ఆ సినిమాలో విలన్ ఎవరో తెలుసు కదా. ఒక్క ఛత్రపతి మాత్రమే కాదు. చాలా సినిమాల్లో ప్రదీప్ రావత్ విలన్ గా నటించాడు. విలన్ అంటే ఇలా ఉండాలి అన్నట్టుగా ఉంటుంది ఆయన విలనిజం. సై మూవీలో కూడా ఆయనే విలన్. ఇక.. ఛత్రపతి సినిమాలో మాత్రం మనోడి విలనిజానికి ప్రేక్షకులు కూడా భయపడ్డారు. అంత భయంకరంగా ఉంటుంది ఆయన నటన.
Chatrapathi Villain Pradeep Rawat and His Wife Latest Visuals at Hansa Singh
చాలామందికి ఆయన ఎవరో.. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. అసలు ఆయన పేరు కూడా చాలామందికి తెలియదు. చాలామంది ఇప్పటికీ ఛత్రపతి విలన్ అనే అంటుంటారు. నిజానికి ప్రదీప్ రావత్ లగాన్ సినిమాలో నటించాడు. ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ వేశాడు. ఆ సినిమా చూసే రాజమౌళి ఆయనకు సై సినిమాలో విలన్ పాత్రను ఇచ్చారు. ప్రదీప్ రావత్ ది మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్.ఛత్రపతి సినిమా తర్వాత ప్రదీప్ రావత్ పేరు మారుమోగిపోయింది.
ఆయనకు తెలుగులో వరుసగా విలన్ గా అవకాశాలు వచ్చాయి. దీంతో దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్ షా, సరైనోడు, అల్లుడుశీను, లయన్, రగడ, బలాదూర్ లాంటి సినిమాల్లో ప్రదీప్ రావత్ విలన్ గా నటించాడు. ఇవన్నీ పక్కన పెడితే ప్రదీప్ రావత్ భార్యను మీరు ఎప్పుడైనా చూశారా? తన పేరు హన్సా సింగ్. ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను ఒక స్టార్ హోటల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రావత్ తన భార్యతో కలిసి సందడి చేశాడు. అప్పుడే ప్రదీప్ రావత్ భార్య ఎవరో చాలామందికి తెలిసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్‌డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.