Serial Actresses : వామ్మో.. ఈ సీరియల్స్ లో నటించే హీరోయిన్లు ఇంత భారీగా పారితోషికం తీసుకుంటారా? స్టార్ హీరోయిన్లు కూడా అంత తీసుకోరుగా | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Serial Actresses : వామ్మో.. ఈ సీరియల్స్ లో నటించే హీరోయిన్లు ఇంత భారీగా పారితోషికం తీసుకుంటారా? స్టార్ హీరోయిన్లు కూడా అంత తీసుకోరుగా

 Authored By kranthi | The Telugu News | Updated on :6 December 2022,9:00 pm

Serial Actresses : సినిమా అనేది ఒక్క రోజు విడుదల అవుతుంది. దాని ఫీవర్ కొన్ని రోజుల పాటే ఉంటుంది. కానీ.. సీరియల్ అలా కాదు. మనింట్లోకే వస్తుంది. టీవీ ఆన్ చేస్తే చాలు.. ఏ చానెల్ చూసినా అన్నింట్లో సీరియల్సే. అందుకే.. సినిమా స్టార్ల కంటే కూడా సీరియల్ స్టార్లకే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఒక్క సీరియల్ ఏళ్లకు ఏళ్లు నడుస్తుంది. అందుకే ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఆ క్యారెక్టర్లకు కనెక్ట్ అవుతారు జనాలు. అయితే.. బుల్లితెర మీద ప్రేక్షకులను అలరిస్తున్న సీరియల్స్ లో నటిస్తున్న పలువురు హీరోయిన్స్ పారితోషికాలు ఎలా ఉంటాయో తెలుసా?

వాళ్లు తీసుకునే పారితోషికం ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు. తెలుగులో టాప్ హీరోయిన్ అంటే కార్తీక దీపం సీరియల్ లో నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ అనే చెప్పుకోవాలి. తను దీపగా, వంటలక్కగా చాలా ఫేమస్. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తనకు ఉన్నంత అభిమానులు ఇంకెవరికీ లేరు. తను సీరియల్ లో ఏడిస్తే.. ఇంట్లో తన అభిమానులు కూడా ఏడుస్తారు. అంతలా తనకు, తన క్యారెక్టర్ కు జనాలు కనెక్ట్ అయ్యారు. అలాంటి ప్రేమీ విశ్వనాథ్ రోజుకు రూ.25 వేల పారితోషికం తీసుకుంటుందట.

these serial actresses has high remuneration

these serial actresses has high remuneration

Serial Actresses : మీనాక్షి సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి రోజుకు ఎంత తీసుకుంటుందంటే?

మీనాక్షి సీరియల్ లో నటించే నవ్య స్వామి రోజుకు రూ.20 వేలు తీసుకుంటుందట. దేవత సీరియల్ లో నటించే సుహాసిని కూడా రోజుకు రూ.20 వేలు తీసుకుంటుందట. అగ్ని సాక్షి సీరియల్ లో నటించే ఐశ్వర్య రోజుకు రూ.20 వేలు తీసుకుంటుందట. భార్యామణి సీరియల్ లో నటించిన పల్లవి అనే హీరోయిన్ రోజుకు రూ.15 వేల పారితోషికం తీసుకుంటుందట. కథలో రాజకుమారి, త్రినయని సీరియల్స్ తో గుర్తింపు పొందిన అషికా రోజుకు రూ.12 వేల రెమ్యునరేషన్ తీసుకుంటుందట.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది