Serial Artist : సీరియ‌ల్స్‌లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా.. బ‌య‌ట మాత్రం ఇలా…. ఎవ‌రీమె…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Serial Artist : సీరియ‌ల్స్‌లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా.. బ‌య‌ట మాత్రం ఇలా…. ఎవ‌రీమె…!

 Authored By ramu | The Telugu News | Updated on :16 May 2024,4:30 pm

Serial Artist : సాధార‌ణంగా సీరియ‌ల్స్‌లో క‌నిపించేవారంద‌రు కూడా చాలా సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా క‌నిపించడం కొన్ని సంవ‌త్స‌రాలుగా వ‌స్తుంది. బ‌య‌ట ఎలా ఉన్నా కూడా సీరియ‌ల్స్‌లో మాత్రం చాలా ప‌ద్ద‌తిగా క‌నిపిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటారు. గుప్ప‌డెంత మ‌న‌సు సీరియ‌ల్ న‌టి సీరియ‌ల్‌లో ప‌ద్ద‌తిగా క‌నిపించిన బ‌య‌ట మాత్రం తెగ ర‌చ్చ చేస్తూ అంద‌రికి షాక్ ఇస్తుంటుంది.ఇప్పుడు ఈ అమ్మ‌డు సీరియ‌ల్‌లోని త‌న పాత్ర‌తో మెప్పిస్తూనే బ‌య‌ట సోష‌ల్ మీడియాలో త‌న అందాల‌తో ర‌చ్చ చేస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతూ ఉంటుంది. మ‌రి ఈ భామ మ‌రెవ‌రో కాదు అమూల్య గౌడ.

Serial Artist ఈ భామ చాలా హాట్ గురు..!

కన్నడలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ భామ క‌న్న‌డ‌లో గౌరి అనే సీరియల్, తెలుగులో గుండెనిండా గుడి గంటలు అనే సీరియల్ చేస్తోంది. అమూల్య గౌడ కన్నడ బిగ్ బాస్ లో పాల్గొన తన సత్తా చాటింది. తాను ఏ విషయంలో కూడా తీసిపోను అని నిరూపించుకుంది. కర్ణాటకలోని మైసూర్‌లో 1993 జనవరి 8న జన్మించిన అమూల్యా.. కన్నడలో ‘కమలి’ అనే సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటి కాకముందు ‘యారిగుంటు యారిగిల్ల’ అనే టీవీ రియాలిటీ షోలో కనిపించింది. 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో నటిగా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత.. ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ వంటి హిందీ/కన్నడ సీరియల్స్‌లో కూడా ఆమె నటించి మెప్పించింది.

Serial Artist సీరియ‌ల్స్‌లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా బ‌య‌ట మాత్రం ఇలా ఎవ‌రీమె

Serial Artist : సీరియ‌ల్స్‌లో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా.. బ‌య‌ట మాత్రం ఇలా…. ఎవ‌రీమె…!

అరమనేలో ‘హిత’ అనే నెగిటివ్ లీడ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే మన తెలుగు ‘కార్తీకదీపం’లానే కన్నడలో ‘కమలి’ అనే సీరియల్ చాలా పాపులర్. ఈ సీరియల్‌లో కమలిగా లీడ్ రోల్ చేసి.. 70 శాతంపైగా కన్నడ అభిమానుల్ని కూడగట్టుకుంది అమూల్య. ఈ అమ్మ‌డికి ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 5.44 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. డాన్స్, రీల్స్, మేకోవర్ అంటూ చాలానే వీడియోస్ చేసి ఫ్యాన్స్, ఫాలోవర్స్ ని అలరిస్తూ ఉంటుంది. చీర‌లోను చాలా ప‌ద్ద‌తిగా క‌నిపించే ఈ ముద్దుగుమ్మ ట్రెండీ డ్రెస్సుల‌లోను త‌నదైన అందాల‌తో కుర్రాళ్ల మ‌న‌స్సులు కొల్ల‌గొడుతూ ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది