Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ మృతికి కారణం ఇదే..!!
Superstar Krishna : సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత మృతి చెందినట్లు కాంటినెంటల్ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటన చేయడం జరిగింది. నిన్న గుండెపోటుకు గురైన కృష్ణను ఆసుపత్రికి తీసుకువచ్చిన నాటి నుంచి ప్రపంచ స్థాయి వైద్యుల చేత అత్యాధునిక చికిత్స అందించారు. ఏలాగైనా కృష్ణనీ కాపాడుకోవడానికి కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు.
ఈ క్రమంలో ప్రతి గంటకు కుటుంబ సభ్యులతో చర్చిస్తూ వైద్యులు వైద్యం అందించడం జరిగింది. అయితే శరీరంలో ప్రధాన అవయవాలు స్పందించకపోవడంతో అప్పటికే హెల్త్ విషమించినట్లు తెలిపారు. కిడ్నీలు, గుండె, మెదడు డ్యామేజ్ సహా శరీరంలో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్లు పేర్కొన్నారు. ఇక ఇదే విషయాన్ని సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో..
అందించే చికిత్స ఫలించదని నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు వైద్యులు తెలియజేశారు. వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ..శరీరంలో ప్రధాన అవయవాలు స్పందించకపోవడంతో కృష్ణ మరణించడం జరిగిందంట. ఓకే ఏడాదిలో కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో అభిమానులు మరియు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.