Check Movie Review : నితిన్ చెక్ మూవీ రివ్యూ
check movie Review : నిన్నటి దాకా.. ఉప్పెన, నాంది సినిమాల క్రేజ్ లో ఉన్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు. ఆ సినిమా తర్వాత మళ్లీ ప్రేక్షకులను మెప్పించడానికి వచ్చింది యంగ్ హీరో నితిన్ మూవీ చెక్. ఇది చాలా వినూత్నమైన కథతో వస్తున్న సినిమా. ఈ సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ నటించారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదలైంది. మరి.. నితిన్ సినిమా చెక్.. ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే కథలోకి వెళ్లాల్సిందే.
Check Movie Review : ఆడియన్స్ ట్విట్టర్ రివ్యూలని బట్టి సినిమా కథ సాగిన విధానం చూస్తే..
Movie | Check Movie Review |
Star Cast | Nithiin , Rakul Preet Singh ,Priya Prakash Varrier |
Director | Chandra Sekhar Yeleti |
Producer | V. Anand Prasad |
Music | Kalyani Malik |
Run Time | 2h 20m |
Check Movie Review : కథ
ఈ సినిమాలో నితిన్ పేరు ఆదిత్య. ఇతడు చెస్ లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ విన్నర్. ఎక్కడికెళ్లినా.. చెస్ లో మనోడిని మించినోడు లేడు. చివరకు కామన్ వెల్త్ చెస్ చాంపియన్ షిప్ ఫైనల్స్ వరకు వెళ్తాడు. ఇలా.. ప్రతి చాంపియన్ షిప్ లో ఆదిత్యదే విజయం.
కానీ.. అనుకోని కారణాల వల్ల నితిన్ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. సినిమా ప్రారంభంలోనే కోర్టు సీన్ ఉంటుంది. జడ్జిమెంట్ నడుస్తుండగా.. సీన్ ప్రారంభం అవుతుంది. ఆదిత్యకు జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్టు జడ్జి తీర్పు చెబుతాడు. అయితే.. ఆదిత్య ఎందుకు జైలుకు వెళ్లాడు అనేది పెద్ద సస్పెన్స్. ఆదిత్య కొందరు టెర్రరిస్టులకు సహకరించాడు.. అనే విషయం మీద జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. ఆ తర్వాత సినిమా జైలులో ప్రారంభం అవుతుంది.
అయితే.. ఆదిత్య కేసును మానస అనే లాయర్ టేకప్ చేస్తుంది. మానస అంటే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఈ సినిమాలో రకుల్ లాయర్ గా కనిపించింది. జైలుకు వెళ్లిన మానస.. ఆదిత్యతో మాట్లాడి.. అసలు ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేస్తుంది….
అప్పుడు ఆదిత్య.. తన గురించి.. తన జీవితం గురించి.. చెస్ గురించి మానసతో చెబుతుంటాడు. అందులో.. తన లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఆదిత్య, ప్రియల ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ప్రియ అంటే హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది. ఆ తర్వాత ప్రియకు ఏమైంది.
చెస్ ఆడుకుంటూ ఉండే ఆదిత్యకు, టెర్రరిస్టులతో ఎలా పరిచయం ఏర్పడింది? అసలు.. జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆదిత్య.. మళ్లీ బయటికి ఎలా వస్తాడు? అసలు ప్రియకు ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమాను తెర మీద చూడాల్సిందే.
విశ్లేషణ
నితిన్ సినిమా అంటే మినిమన్ గ్యారెంటీ అనే విషయం తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అందులోనూ విభిన్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో కలిసి సినిమా చేయడమంటే.. ఖచ్చితంగా అది బ్లాక్ బస్టరే అని ముందే నితిన్ అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్షకులు అనుకున్నారు. చంద్రశేఖర్ ఏలేటి.. సినిమాల్లోని కథ చాలా వెరైటీ గా ఉంటుంది. ఆయన్నుంచి ఎటువంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు కోరుకుంటారో అందరికీ తెలుసు. అటువంటి సినిమానే మరోసారి తెరకెక్కించి శెభాష్ అనిపించుకున్నాడు చంద్రశేఖర్ ఏలేటి.
సరికొత్త సబ్జెక్ట్ తో ఎక్కడా చెక్ పెట్టే సమస్య లేకుండా.. సినిమా సాఫీగా వెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. రొటీన్ కథాంశాలు లేకుండా… మాస్ మసాలాను దట్టించకుండా.. ప్రేక్షకులకు సరికొత్త కథను పరిచయం చేసి.. దానికి కనెక్ట్ అయ్యేలా చేశాడు దర్శకుడు. థ్రిల్లింగ్ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించి.. ప్రేక్షకులకు కూడా మాంచి థ్రిల్లింగ్ ను అందించాడు.
ప్లస్ పాయింట్స్
సినిమాకు ప్లస్ పాయింట్స్ హీరో, డైరెక్టర్, సరికొత్త కథనం. ఈ మూడే సినిమాను ఎక్కడికో తీసుకుపోయాయి. సినిమాలో స్క్రీన్ ప్లే, ప్రీ ఇంటర్వెల్ అదిరిపోయింది. ఇక.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక.. హీరో నితిన్ ఇప్పటి వరకు నటించని షేడ్స్ లో నటించాడు. ఇప్పటి వరకు నితిన్ సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు. కొత్త నితిన్ ను ఈ సినిమాలో చూడొచ్చు. నితిన్ లో చాలా వేరియషన్స్ ఉన్నాయి. నితిన్ తో పాటు ఈ సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ చాలా ప్లస్ పాయింట్ అయింది.
మైనస్ పాయింట్స్
అన్ని సినిమాల్లాగానే ఈ సినిమాకు కూడా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్, స్లోగా నడుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న స్క్రీన్ ప్లే.. సెకండ్ హాఫ్ లో లేదు. సినిమా రన్ టైమ్ ఇంకాస్త పెంచితే బాగుండు. సినిమాలోని పాత్రల గురించి పెద్దగా ప్రేక్షకులకు పరిచయం చేయలేదు దర్శకుడు. దాని వల్ల ప్రేక్షకులు కొన్ని పాత్రలతో కనెక్ట్ కాలేకపోయారు.
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. మాస్ మసాలా, దంచికొట్టుడు, కమర్షియల్ ఫైట్లు, పంచ్ డైలాగ్స్ కావాలనుకునే వాళ్లకు ఈ సినిమా నచ్చదు. ఈ సినిమా పూర్తిగా రొటీన్ సినిమాలకు భిన్నం. లాజికల్ గా ఆలోచిస్తూ ఈ సినిమాను చూడాల్సి ఉంటుంది. అందుకే.. లాజికల్ సినిమాలు, థ్రిల్లర్ కథాంశాలు అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ సినిమాను సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు.
ఏదో ఒకటి.. ఈ వీకెండ్ కు ఎలాగూ ఏ సినిమా లేదు కాబట్టి.. ఈ సినిమాకే చెక్ పెట్టేద్దాం అంటే అది మీ ఇష్టం.