Sri Vidya : చిత్ర పరిశ్రమలో ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేయడం కామన్. మోసపోతుండటం హీరోయిన్లకు కామన్ అయిపోయింది. ఇది ఈ మధ్యకాలంలో మొదలైన సంప్రదాయం కాదు. నానాటికీ ఇలా డైరెక్టర్లు, యాక్టర్ల చేతిలో మోసపోతున్న హీరోయిన్ల సంఖ్య పెరిగిపోతుంది. ఇందులో కుర్ర హిరోయిన్లతో పాటు అలనాటి సీనియర్ హీరోయిన్లు కూడా ఉన్నారు. అయితే, స్టార్ యాక్టర్‌తో పాటే ఇద్దరు డైరెక్టర్ల చేతిలో సీనియర్ నటి శ్రీ విద్య మోసపోవడమే కాకుండా కెరీర్ చివర్లో తీవ్రఇబ్బందుల మధ్య జీవితాన్ని లీడ్ చేసిందని ఆమె సన్నిహితులు చెప్పడంతో అసలు విషయం వెలుగుచూసింది. నటి శ్రీ విద్య బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఆ తరవాత హీరోయిన్‌గా వెండితెరపై కనిపించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ శ్రీ విద్య నటించారు. ఆమె చెన్నైలో జన్మించగా తండ్రి ఆర్ కృష్ణమూర్తి తమిళంలో ప్రముఖ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తల్లి వసంతకుమారి కర్నాటక సంగీతంలో చాలా పాపులర్.శ్రీ విద్య పుట్టిన ఏడాదికే ఆమె తండ్రి అనారోగ్యం బారినపడి మృతి చెందగా ఆమె ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వచ్చింది.దీంతో శ్రీ విద్య ఆమె బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తాతమనవడు మూవీలో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిద్య.. పెద్దయ్యాక తన అందం అభినయంతో హీరోయిన్‌గా అవకాశాలను చేజిక్కించుకుంది. ‘ఢిల్లీ టూ మద్రాస్’ సినిమాతో శ్రీ విద్య హీరోయిన్ గా పరిచయం అవ్వగా..
బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అప్పట్లో జయప్రద, జయసుధ లాంటి హీరోయిన్‌కు శ్రీవిద్య పోటీ ఇచ్చారు. హీరోయిన్‌గా సక్సెస్ అవుతున్న టైంలో శ్రీవిద్య కమల్ హాసన్ ప్రేమించుకుంటున్నారని కోలీవుడ్ లో వార్తలు గుప్పుమన్నాయి.కమల్‌తో ఈవిడ పీకల్లోతూ ప్రేమలో ఉన్నారని తెలియగా.. అప్పుడే కమల్ వాణి గణపతితో ప్రేమలో ఉన్నారని తెలిసి శ్రీవిద్య ఆయనకు దూరంగా ఉన్నారట.అనంతరం తమిళ సినిమాలకు దూరమై మలయాళంలో బిజీ అయ్యారు. అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ జార్జిథామస్‌తో ప్రేమలో పడిన శ్రీవిద్య జార్జి థామస్‌ను వివాహం చేసుకుంది. అతను చెడ్డవాడు అని తెలిసి విడాకులు ఇచ్చేసింది. ఆ తరవాత భరతన్ అనే మరో దర్శకుడి చేతిలో మోసపోయి తీవ్ర నిరాశమైన జీవితాన్ని గడిపినట్టు తెలుస్తోంది.
Nagarjuna : ప్రతి శనివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8 వేదికపైకి వచ్చి తెగ సందడి…
Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…
Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…
Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్‌మెంట్‌లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…
Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంపతులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…
This website uses cookies.