Sudigali Sudheer : ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా మేం ఒకటే.. సుడిగాలి సుధీర్ పోస్ట్ వైరల్
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ క్రేజ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సుధీర్ ఇప్పుడు బుల్లితెరపై స్టార్‌గా దూసుకుపోతోన్నాడు. అయితే ఇప్పుడు వెండితెరపై ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోగా ఆల్రెడీ రెండు మూడు సినిమాలు సెట్స్ మీదున్నాయి. సుధీర్ హీరోగా నిలబడేందుకు బాగానే ట్రై చేస్తున్నాడు. ఇంతకు ముందు కూడా హీరోగా నటించాడు. కానీ అవేవీ అంతగా ఆడలేదు. ఇక ఇప్పుడు మళ్లీ హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే బుల్లితెరకు కాస్త గ్యాప్ ఇస్తున్నాడు. ఇది వరకు అయితే శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ, ఎక్స్ ట్రా జబర్దస్త్ అంటూ ఇలా బాగానే సందడి చేశాడు. ఇప్పుడు అవన్నీ మానేశాడు. టైం సరిపోవడం లేదని దూరంగా వచ్చాడు. అయితే అదే సమయంలో స్టార్ మాలోని సింగింగ్ షోకు హోస్ట్‌గా మారాడు.
అలా ఈటీవీ నుంచి స్టార్ మాకు రావడంతో ఎన్నెన్నో గాసిప్స్ వచ్చాయి. మల్లెమాలతో విబేధాలు అని, ఇంకెప్పుడూ ఈటీవీ షోల్లో కనిపించడు అంటూ వార్తలు వినిపించాయి. దీంతో పాటు ముగ్గురి మధ్య స్నేహం కూడా చెడిందంటూ రూమర్లు వచ్చాయి. కొన్ని రోజులు ఆటో రాం ప్రసాద్ ఒక్కడే స్కిట్లు నడిపించాడు. ఇద్దరూ లేరనే బాధ ఉందని స్టేజ్ మీద ఏడ్చేశాడు. అయితే గత రెండు వారాల నుంచి గెటప్ శ్రీను కూడా వచ్చాడు. గెటప్ శ్రీను రాకతో అంతా మారింది. మళ్లీ రాంప్రసాద్, గెటప్ శ్రీను కలిసి స్కిట్లు వేస్తున్నారు. ఇక ఇందులో సుధీర్ కనిపించకపోవడంతో అభిమానులకు లోటు కనిపిస్తోంది.
Sudigali Sudheer ABout Getup Srinu And Auto Ram Prasad
ఈ విషయం మీద సుధీర్ పరోక్షంగా స్పందించాడు. తన ఇన్ స్టా గ్రాంలో ఈ మేరకు ఓ పోస్ట్ వేశాడు. నా బలం, నా సంతోషం, నా నాటీ అంతా కూడా వీళ్లే.. మేం ఎంత దూరంలో ఉన్నా కూడా.. ఎక్కడున్నా కూడా.. మా బంధం ఎప్పటికీ ముగిసిపోదు అంటూ గెటప్ శ్రీను, రాం ప్రసాద్ గురించి చెప్పుకొచ్చాడు సుధీర్. అయితే ఇకపై ఈ ముగ్గురు కలిసి బుల్లితెరపై కనిపించే అవకాశం లేదని సుధీర్ పోస్టును బట్టి అర్థమవుతుంది.
Sudigali Sudheer ABout Getup Srinu And Auto Ram Prasad
