Tollywood Small Films : చిన్న సినిమాలు.. దుమ్మురేపాయి.. 2023 లో అదరగొట్టేసిన ఆ చిన్న సినిమాలు ఏవో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tollywood Small Films : చిన్న సినిమాలు.. దుమ్మురేపాయి.. 2023 లో అదరగొట్టేసిన ఆ చిన్న సినిమాలు ఏవో తెలుసా?

Tollywood Small Films : చిన్న సినిమాలంటే అందరికీ చిన్నచూపే. ఆ సినిమాలకు అసలు థియేటర్లు కూడా దొరకవు. కానీ.. ఒక్కోసారి ఆ చిన్న సినిమాలు తమ సత్తాను చూపిస్తాయి. పాన్ ఇండియా సినిమాలు, ఇంకా వేరే సినిమాలు ఏవైనా కానీ.. వీటి ముందు దిగదుడుపే. చివరకు పాన్ ఇండియా అంటూ వచ్చిన కొన్ని సినిమాలు అయితే ఈ సినిమాల ముందు చతికిలపడ్డాయి. ఇక.. ఈ సినిమాలు చిన్న సినిమాలుగా విడుదలై ప్రభంజనం సృష్టించాయి. 2023 లో […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 July 2023,9:00 pm

Tollywood Small Films : చిన్న సినిమాలంటే అందరికీ చిన్నచూపే. ఆ సినిమాలకు అసలు థియేటర్లు కూడా దొరకవు. కానీ.. ఒక్కోసారి ఆ చిన్న సినిమాలు తమ సత్తాను చూపిస్తాయి. పాన్ ఇండియా సినిమాలు, ఇంకా వేరే సినిమాలు ఏవైనా కానీ.. వీటి ముందు దిగదుడుపే. చివరకు పాన్ ఇండియా అంటూ వచ్చిన కొన్ని సినిమాలు అయితే ఈ సినిమాల ముందు చతికిలపడ్డాయి. ఇక.. ఈ సినిమాలు చిన్న సినిమాలుగా విడుదలై ప్రభంజనం సృష్టించాయి. 2023 లో చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలు అంటే అందరూ ఈ మూడు సినిమాల గురించే మాట్లాడుతారు.

ఇంతకీ ఆ మూడు సినిమా ఏంటి అంటారా? మీరు కూడా గెస్ చేయొచ్చు. అందులో తొలి స్థానాన్ని ఆక్రమించింది బలగం. ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అసలు తెలుగు సినిమా చరిత్రలోనే ఇప్పటి వరకు ఇలాంటి సినిమా రాలేదు. ఈ సినిమాకు ఎంత ఆదరణ వచ్చిందంటే.. ఏ సినిమాకు కూడా ఈరోజుల్లో ఊళ్లలో పరదాలు వేసుకొని చూడలేదు. ఎంత బిగ్ స్టార్ సినిమాలకు కూడా అలాంటి ఆదరణ రాలేదు కానీ.. బలగం సినిమా ఊరూరా ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉన్న ఆ సినిమాకు తెలంగాణ ప్రజలే కాదు.. వేరే రాష్ట్రాల ప్రజలు కూడా ఆదరించారు. చిన్న సినిమాగా విడుదలై ప్రభంజనం సృష్టించింది ఆ సినిమా.

three small films in tollywood in 2023 big blockbusters

three small films in tollywood in 2023 big blockbusters

Tollywood Small Films : ఆ తర్వాత లిస్టులో ఉన్న సినిమాలు సామజవరగమన, బేబీ

ప్రేక్షకుడు ఒక రెండు గంటలు సినిమా థియేటర్ లో కూర్చొని సినిమా చూస్తున్నంత సేపు బయటి ప్రపంచాన్ని మరిచిపోవాలి. కేవలం ఆ సినిమాను ఎంజాయ్ చేయాలి. అప్పుడే ఆ సినిమా సక్సెస్ అయినట్టు. సామజవరగమన సినిమా అదే చేసి చూపించింది. ఫుల్ టు ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక.. ఇటీవల రిలీజ్ అయిన బేబీ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొత్తం మీద 2023 లో ఇప్పటి వరకు వచ్చిన చిన్న సినిమాల్లో అదరగొట్టేసిన సినిమాలు అంటే ఈ మూడు సినిమాలే అని చెప్పుకోవాలి.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది