Bigg Boss Season 6 : బిగ్‌బాస్ టీమ్‌ కు పెద్ద షాక్ ఇచ్చిన టిక్ టాక్ దుర్గారావ్‌.. నీకో దండంరా బాబు!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 4 July 2022, 1:30 pm

Bigg Boss Season 6 : తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 6 కు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వచ్చే నెలలో బిగ్‌బాస్ ను మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే పెద్ద కంటెస్టెంట్స్ లిస్ట్‌ ను షార్ట్‌ ఫామ్‌ కు తీసుకు వచ్చారు. దాదాపుగా 25 మంది జాబితాను రెడీ చేశారు. అందులో నుండి కొద్ది మందిని చివరి నిమిషంలో తప్పించే అవకాశాలు ఉంటాయి. ఆ పాతిక మందిలో టిక్ టాక్ దుర్గారావు కూడా ఉన్నాడు. ఆయన బిగ్ బాస్ హౌస్‌ లోకి వెళ్లడం దాదాపుగా కన్ఫర్మ్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో బిగ్ బాస్‌ టీమ్ వారికి టిక్ టాక్ దుర్గారావు బిగ్‌ షాక్ ఇచ్చాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

తనకు బిగ్‌ బాస్ ఆఫర్‌ వచ్చినందుకు చాలా సంతోసంగా ఉంది. కాని తాను ఒక్కడిని బిగ్‌ బాస్ హౌస్‌ కు వెళ్లబోను అంటూ చెప్పుకొచ్చాడట. ఫైనల్ జాబితాలో పేరును చేర్చిన తర్వాత ఇప్పుడు దుర్గారావు తనతో పాటు తన భార్య కూడా బిగ్ బాస్ హౌస్‌ కు రావాల్సిందే అంటూ పట్టుబడుతున్నాడట. పారితోషికం అదనంగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కాని ఆమె ను తనతో పంపిస్తే అప్పుడు ఇద్దరం కలిసి ఎంటర్‌ టైన్‌మెంట్‌ ఇవ్వడంతో పాటు తాను ధైర్యంగా ఉంటాము అన్నట్లుగా ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్లుగా కాకుండా డిమాండ్‌ చేస్తున్నాడట. ఈ విషయంలో స్టార్‌ మా మరియు బిగ్‌ బాస్ టీమ్‌ చర్చలు జరిపారు.

Tik Tok Durga Rao demand for Bigg Boss season 6

Tik Tok Durga Rao demand for Bigg Boss season 6

గతంలో దంపతులను పంపిణ దాఖలాలు ఉన్నాయి. కాని ఇద్దరు స్టార్‌ సెలబ్రెటీలు అయితే పంపిస్తే బాగుంటుంది. కాని దుర్గారావు భార్యకు పెద్దగా క్రేజ్ లేదు. కనుక ఆమెను పంపించడం సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చారు. నీవు వెళ్లాలి అనుకుంటే ఒంటరిగా పంపిచే అవకాశం ఉంది.. లేదు తోడు కావాలి.. భార్య కావాలి అంటే మాత్రం నీకో దండం దుర్గారావు ఇక దయచేయి అన్నట్లుగా బిగ్‌ బాస్ టీమ్‌ వారు దుర్గారావుతో అన్నట్లుగా తెలుస్తోంది. దాంతో దుర్గారావు మళ్లీ ఆలోచనల్లో పడ్డాడు. ఈ నెల మూడవ వారంకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఒప్పందం తాలూకు అగ్రిమెంట్స్ జరుగుతున్నాయి. అప్పటి వరకు అగ్రిమెంట్ పై సంతకం చేయకుంటే ఒప్పందం క్యాన్సిల్‌ అవుతుందట.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp