
tollywood 11 heroines acts as sisters
Tollywood : సినిమాలలో కొన్ని కీలకమైన పాత్రలో స్టార్ హీరోలు, హీరోయిన్స్ నటిస్తుంటారు. వాటిలో కొన్ని సినిమాలలో కొన్ని కాంబినేషన్‌ని అభిమానులు అసలూ ఊహించరు. ఇద్దరు హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే సినిమాలనే మల్టీస్టారర్స్ అంటారు. ఆ కాలంలో ఎన్.టి.ఆర్ – ఏ.ఎన్.ఆర్, కృష్ణ -శోభన్ బాబు లాంటి కాంబినేషన్స్ లో సినిమాలు వచ్చేవి. బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు కూడా చాలానే. అలాగే అప్పుడు వచ్చిన సినిమాలలో సావిత్రి – జమున, రాధ – విజయ శాంతి, సుహాసిని – విజయశాంతి లాంటి హీరోయిన్ కలిసి ఒకే సినిమాలలో నటించారు. అక్కా – చెల్లెళ్ళుగా, స్నేహితులుగా కనిపించి ఆకట్టుకున్నారు.
tollywood 11 heroines acts as sisters
అలా స్టార్ హీరోయిన్స్ అక్కా చెల్లెళ్ళుగా నటించిన సినిమాలు చాలానే ఉన్నాయి. వీటిలో బ్లాక్ బస్టర్ సాధించిన సినిమాలు హీరోయిన్స్ లిస్ట్ లో బాగానే ఉన్నాయి. అలాంటి సినిమాలను కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. ఎం.రాజు నిర్మించిన ‘పౌర్ణమి’ సినిమాలో త్రిష, ఛార్మి అక్క చెల్లెళ్ళుగా నటించారు. ఇద్దరికి ఆ సమయంలో మంచి క్రేజ్ ఉంది. విక్టరీ వెంకటేశ్ నటించిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో సౌందర్య – వినీత కనిపించారు. ఇలా చాలా సినిమాలలో స్టార్ హీరోయిన్ కలిసి స్క్రీన్ మీద సందడి చేశారు.
tollywood 11 heroines acts as sisters
ఐశ్వర్య రాయ్ – టబు : ఈ ఇద్దరు ఒకప్పుడు సౌత్ అండ్ నార్త్ సినిమాలలో స్టార్ హీరోయిన్స్ గా వెలిగారు. ఇద్దరు కలిసి ‘ప్రియురాలు పిలిచింది’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. రాజీవ్ మేనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజిత్ హీరోగా నటించాడు. మీనా – నగ్మా : అక్కినేని నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ సినిమాలో మీనా – నగ్మా సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. ప్రముఖ దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. రవళి – దీప్తి భట్నాగర్ : దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చి భారీ సాధించిన చిత్రం పెళ్ళి సందడి. శ్రీకాంత్ హీరోగా నటించిన ఇందులో రవళి – దీప్తి భట్నాగర్ సొంత అక్కా చెల్లెళ్లుగా నటించారు. ఇదొక మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.
లయ – గజాల : ఇదొక ఊహించని కాంబినేషన్. ‘నాలో ఉన్న ప్రేమ’ సినిమాలో వీళ్ళు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. వి.ఆర్.ప్రతాప్ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. షీలా -పూనమ్ బజ్వా : బొమ్మరిల్లు లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పరుగు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో షీలా -పూనమ్ బజ్వా సొంత అక్కా చెల్లెళ్లుగా నటించారు.
తమన్నా – ఆండ్రియా : తమిళ సినిమా రీమేక్ గా తెలుగులో వచ్చిన ‘తడాకా’ సినిమాలో వీరిద్దరు సొంత అక్కా చెల్లెళ్లుగా కనిపించారు. కిశోర్ కుమార్ పార్ధసాని ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. అక్కినేని నాగ చైతన్య – సునిల్ అన్నదమ్ములుగా నటించారు. యావరేజ్ హిట్ తెచ్చుకుంది ఈ సినిమా. త్రిష – సంజన గల్రాని : డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ – డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో త్రిష – సంజన గల్రాని సొంత అక్కా చెల్లెళ్ళుగా నటించారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వీరికి అన్నయ్యగా కనిపించారు.
పూజా హెగ్డే – ఈషా రెబ్బా : యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో పూజా హెగ్డే – ఈషా రెబ్బా అక్కా చెల్లెళ్ళుగా నటించారు. ఈ సినిమా ఈషాకి చాలా హెల్ప్ అవుతుందని భావించింది. కానీ క్రెడిట్ మొత్తం పూజా హెగ్డేకే వెళ్ళింది. సమంత – ప్రణీత : 100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా అత్తారింటికి దారేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చింది. ఇందులో సమంత – ప్రణీత సొంత అక్కా చెల్లెళ్ళుగా నటించారు.
ఇలియానా – కమలినీ ముఖర్జీ : త్రివిక్రం శ్రీనివాస్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా సినిమాలో వీరు అక్కాచెల్లెళ్ళుగా నటిచారు. ముందు అక్కని ప్రేమించిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చెల్లి ఇలియానాని ప్రేమిస్తాడు. మంచి కమర్షియల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా కమిలినీ ముఖర్జీకి మాత్రం పెద్దగా ఉపయోగపడలేదు. తమన్నా – మెహ్రీన్ : సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి – వెంకటేశ్ – వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చి 100 కోట్ల క్లబ్ లో చేరిన ఎఫ్ 2లో తమన్నా – మెహ్రీన్ వరుసకి అక్కా చెల్లెళ్ళుగా నటించారు.
ఇది కూడా చదవండి ==> Sri Reddy : జగన్ గారు మీరే నన్ను ఆదుకోవాలి.. డబ్బుల కోసమే ఆ వీడియోలు చేస్తున్నానంటున్న శ్రీరెడ్డి?
ఇది కూడా చదవండి ==> Jabardasth Varsha : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష పెళ్లి ఫిక్స్.. ఇదిగో పెళ్లి కార్డు?
ఇది కూడా చదవండి ==> Jabardasth : జబర్దస్త్ తో పాటు.. యూట్యూబ్ చానెల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న కమెడియన్లు వీళ్లే?
ఇది కూడా చదవండి ==> Jabardasth : చిరంజీవితో పాటే ఇండస్ట్రీకి వచ్చిన జబర్దస్త్ నటుడు ఎవరో తెలుసా?
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.