Jabardasth : చిరంజీవితో పాటే ఇండస్ట్రీకి వచ్చిన జబర్దస్త్ నటుడు ఎవరో తెలుసా?
Jabardasth : జబర్దస్త్.. ఖతర్నాక్ కామెడీ షో గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ అనే కామెడీ షో.. ఎందరికో లైఫ్ ఇచ్చింది. ఎందరినో కమెడియన్లను చేసింది. గత ఎనిమిదేళ్ల నుంచి జబర్దస్త్ అప్రతిహాతంగా ప్రసారం అవుతోంది. ఇప్పటి వరకు టీఆర్పీలో కానీ.. ప్రేక్షకుల మన్ననలు పొందడం విషయంలో కానీ.. ఏ షో కూడా జబర్దస్త్ ను బీట్ చేయలేదు. గత 8 ఏళ్ల నుంచి జబర్దస్త్ కు పోటీగా చాలా కామెడీ షోలు వచ్చాయి. అయితే.. అన్ని షోలు జబర్దస్త్ ముందు దిగదుడుపే అయ్యాయి కానీ.. ఏది జబర్దస్త్ కు పోటీ ఇవ్వలేకపోయింది.

jabardasth raising raju in tollywood industry
జబర్దస్త్ కు ఎంత పేరు వచ్చిందో.. జబర్దస్త్ నటులకు కూడా అంత పేరు వచ్చింది. అయితే.. జబర్దస్త్ నటులు పైకి స్టేజీ మీద ప్రేక్షకులను నవ్వించడం కోసం ఎంతో చేస్తుంటారు కానీ.. వాళ్ల నవ్వుల వెనుక తీరని విషాదం ఉంది. జబర్దస్త్ స్టేజీ ఎక్కడం కోసం వాళ్లు ఎన్నో పాట్లు పడ్డారు. తమకు నవ్వించే సత్తా ఉన్నా.. సరైన ప్లాట్ ఫాం దొరకక ఎన్నో ఇబ్బందులకు పడ్డారు. అలా.. దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో ఉండి.. అవకాశాలు లేక.. తిండి లేక ఎన్నో పాట్లు పడ్డ జబర్దస్త్ కమెడియన్ రైజింగ్ రాజు గురించే ఇప్పుడు మనం మాట్లాడుకునేది.

jabardasth raising raju in tollywood industry
Jabardasth : రైజింగ్ రాజు.. ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లు దాటిందట
రైజింగ్ రాజు.. ఇప్పటి మనిషి కాదండోయ్.. సినిమా ఇండస్ట్రీతో ఆయనకు ఉన్న అనుభవమే వేరు. జబర్దస్త్ కంటే ముందు రైజింగ్ రాజు అంటే ఎవ్వరికీ తెలియదు. కానీ.. జబర్దస్త్ వచ్చాకనే ఆయన రైజింగ్ రాజు అయిపోయారు. ప్రస్తుతం హైపర్ ఆది టీమ్ లో సగం టీమ్ లీడర్. ఆయన పేరుతో టీమ్ కూడా ఉంది. మొత్తానికి తనకు ఇండస్ట్రీకి వచ్చిన 40 ఏళ్ల తర్వాత విజయం వరించింది.
Jabardasth : ఆయన కెరీర్ ఎలా మొదలైందంటే?
మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారో… రైజింగ్ రాజు కూడా అదే సమయంలో ఇండస్ట్రీకి వచ్చారట. రాజు సొంతూరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం. 42 ఏళ్ల కింద ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే.. ఇండస్ట్రీకి వచ్చాక.. ఆయనకు గుర్తింపు మాత్రం రాలేదు. జీవితంలో ఎన్నో కష్టాలను పడ్డారట. ఓ సినిమా ఆఫీసులో ఆఫీస్ బాయ్ గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. 1981 లో రైజింగ్ రాజు మరో మలుపు అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత సినిమాల్లో చిన్నా చితకా వేషాలు దక్కాయి కానీ.. ఏవీ సరైన గుర్తింపును ఇవ్వలేదు.

jabardasth raising raju in tollywood industry
షార్ట్ మూవీస్ లోనూ రాజు నటించారు కానీ.. అక్కడా గుర్తింపు లభించలేదు. ఆ సమయంలో కూలి పని చేయడానికి కూడా రాజు వెనుకాడలేదు. పెళ్లి అయ్యాక తన కష్టాలు ఇంకా పెరిగాయి. ఏది ఏమైనా.. జబర్దస్త్ ప్రారంభం అవడం.. చలాకీ చంటి.. రాజును తన టీమ్ లో తీసుకోవడం.. ఆ తర్వాత రాజు దశే మారిపోయింది. ఇప్పుడు రైజింగ్ రాజు.. చాలా రైజింగ్ లో ఉన్నాడు. ఇండస్ట్రీకి వచ్చిన నాలుగు దశాబ్దాల తర్వాత తనకు చాలా గుర్తింపు లభించడంతో ఆయన ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.