Sri Reddy : జగన్ గారు మీరే నన్ను ఆదుకోవాలి.. డబ్బుల కోసమే ఆ వీడియోలు చేస్తున్నానంటున్న శ్రీరెడ్డి?
Sri Reddy : శ్రీరెడ్డి తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను పరిచయం అక్కర్లేని వ్యక్తి. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆమె బాగా పాపులర్ అయింది. మా ఆఫీస్ వద్ద ఆమె చేసిన రచ్చ అందరికీ తెలుసు. అప్పటి నుంచే తను మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అప్పటి నుంచి రోజూ ఎవరో ఒకరి మీద తిట్ల దండకం పాడటం తనకు అలవాటు. ఎవరో ఒకరిని […]
Sri Reddy : శ్రీరెడ్డి తెలుసు కదా. తన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను పరిచయం అక్కర్లేని వ్యక్తి. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆమె బాగా పాపులర్ అయింది. మా ఆఫీస్ వద్ద ఆమె చేసిన రచ్చ అందరికీ తెలుసు. అప్పటి నుంచే తను మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అప్పటి నుంచి రోజూ ఎవరో ఒకరి మీద తిట్ల దండకం పాడటం తనకు అలవాటు. ఎవరో ఒకరిని ఏకి పారేయకుండా తను ఉండలేదు. తెలుగు ఇండస్ట్రీలోనే తను ఓ సంచలనం. టాలీవుడ్ లో నెపోటిజం, కాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని.. తన వాయిస్ ను పది మందికి చేరవేసింది శ్రీరెడ్డి. అలాగే.. సోషల్ మీడియాలో తను రోజూ చేసే రచ్చ మామూలుగా ఉండదు.
నిజానికి.. శ్రీరెడ్డి ఎక్కువగా చెన్నైలో ఉంటుంది కానీ.. తనకు ఏపీతో అనుబంధం ఎక్కువ. తన సొంతూరు ఏపీనే. అందుకే.. ఎప్పుడూ ఏపీ గురించి ఏదో ఒక విషయం మాట్లాడుతూ ఉంటుంది. అలాగే.. టాలీవుడ్ సెలబ్రిటీల గురించి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ చర్చనీయాంశం అవుతుంటుంది. తనకు రాజకీయాలు అంటే కూడా ఇష్టమే. తను ఎక్కువగా.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ సీఎం జగన్… వీళ్లిద్దరినీ తెగ పొగిడేస్తుంటుంది.
Sri Reddy : జగన్ పై టర్న్ అయిన శ్రీరెడ్డి ఫోకస్
అయితే.. తాజాగా శ్రీరెడ్డి తన ఫోకస్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ వైపునకు తిప్పింది. వైసీపీ పార్టీలో చేరాలని తను చాలా రోజుల నుంచి ట్రై చేస్తోంది కానీ సెట్ కావడం లేదు. సరైన సమయం కోసం శ్రీరెడ్డి వెయిట్ చేస్తోంది. సోషల్ మీడియాలో జగన్ పై ప్రశంసల వర్షం కురిపించడం ప్రారంభించింది శ్రీరెడ్డి. జగన్.. ఏదైనా కొత్త పథకాన్ని తీసుకొస్తే చాలు.. కొత్త స్కీమ్ ను లాంచ్ చేస్తే చాలు.. ఆహా జగన్.. ఓహో జగన్ అంటూ తెగ పొగిడేస్తోంది శ్రీరెడ్డి.
తాజాగా శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ మాత్రం ఏపీ రాజకీయాల్లో దుమారం లేపుతోంది. నీ వీడియోలు చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. ఎందుకు అంత ఓవర్ గా బిల్డప్ ఇస్తూ వీడియోలు చేస్తున్నావు.. అంటూ శ్రీరెడ్డిని ఓ నెటిజన్ ప్రశ్నించేసరికి.. ఇక చూసుకోండి.. తను పెద్ద రచ్చే చేసింది. కేవలం డబ్బుల కోసం అటువంటి వీడియోలు చేస్తున్నా. నిజానికి నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది కానీ.. జగన్ గారు కరుణించడం లేదు. అప్పటి వరకు బతకాలి కదా. అందుకే ఈ వీడియోలు అంటూ పెద్ద షాకింగ్ రిప్లయి ఇచ్చింది ఆ నెటిజన్ కు.అలాగే.. జగన్ గారు ఈ వెధవల కోసం నన్ను డైరెక్ట్ గా పాలిటిక్స్ రంగంలోకి దింపండి. ముళ్లును ముళ్లుతోనే తీయండి. మీ దగ్గర సర్రుమని తెగే కత్తిలా, ఏకే 47 లా పడి ఉంటా. మీ జోలికి వచ్చిన వాడి తల ఎగిరిపోవాలి. టైం చూసి నాకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తున్నా.. అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి పెద్ద రచ్చకు తెర లేపింది శ్రీరెడ్డి.