వాడ్ని చంపినవాడితో పడుకుంటా : సెన్షేనల్ కామెంట్స్ చేసిన టాలీవుడ్ హీరోయిన్..!
rekha boj : సమాజంలో నిత్యం జరిగే కొన్ని ఆకస్మిక సంఘటనలపై సినీ తారలు, రాజకీయా నాయకులు స్పందిస్తున్న సంగతి తెలిసిందే. చేతనైనంత సహాయం చేసేందుకు ..మోసపోయిన వారి పక్షాన నిలబడి న్యాయం జరిపించేందుకు అండగా నిలబడుతుంటున్నారు. కరోనా క్రైసిస్‌లో కొన్ని లక్షల మందికి సౌత్ సినిమా ఇండస్ట్రీలోని సినీ తారలు, బాలీవుడ్ స్టార్స్ అండగా నిలబడి ఆదుకున్నారు. అయితే కొంతమంది కిరాతకుల ఆకృత్యాలకి అమాయమైన అమ్మాయిలు సమాజంలో బలిపశువులుగా మారుతున్నారు. అమ్మాయి దేనికైనా ఒప్పుకోకపోతే యాసిడ్ దాడులు, హత్యలు చేయడానికి పాల్పడుతున్నారు.

tollywood Actress rekha boj post on ramy murder case
అలాంటి వాళ్లను గన్‌తో కాల్చాలి రేఖా భోజ్
ఇలాంటి సంఘటనలు సామాన్యుల దగ్గర్నుంచి సినీ, రాజకీయా, సమాజిక వేత్తలు, మహిళా సంఘాల వారిని ఎంతగానో కలచి వేస్తున్నాయి. ఆ క్షణంలో కొందరు ఎలా రియాక్ట్ అవుతున్నారంటే, అఘాయిత్యానికి పాల్పడినవాడు కళ్ళెదురుగా ఉంటే గన్‌తో కాల్చో, కత్తితో పొడిచో చంపేయాలన్న కసితో ఉంటున్నారు. ఆ ఆవేశాన్నే తమ సోషల్ మీడియా వేదికలోనూ పంచుకుంటున్నారు. అలానే తాజాగా తన ఎమోషన్‌ని టాలీవుడ్ హీరోయిన్ రేఖా భోజ్ తాన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకుంది. ఆమె చేసిన సెన్షేషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

tollywood Actress rekha boj post on ramy murder case
ఇటీవల ఆంధ్రప్రదేశ్.. గుంటూరు నగరంలోని బీటెక్ చదువుతున్న విద్యార్ధిని రమ్య హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఏపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రమ్యను అత్యంత కిరాతమగా హతమార్చిన శశికిరణ్ ని వెంటనే కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి నిందితుడ్ని అరెస్ట్ చేసింది.
ఇదే సమయంలో శశికిరణ్ ని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సంఘటన చూసి చలించిపోయిన యువ నటి రేఖా భోజ్ ఎమోషనల్ అవుతూ “వాడ్ని చంపినవాడితో పడుకుంటా..ఐయాం సారీ”..ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అత్థం కావడం లేదు. వెంటనే అతన్ని శిక్షించాలని తన పోస్ట్ ద్వారా తెలిపింది.