Tollywood : టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరు.. దాసరి ఉంటే ఏం చేసేవారు.. చిరంజీవి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు..?
ప్రధానాంశాలు:
Tollywood : టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరు.. దాసరి ఉంటే ఏం చేసేవారు.. చిరంజీవి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు..?
Tollywood : సినీ పరిశ్రమలో ఏదైనా సమస్య ఉంటే పెద్దదిక్కుగా వచ్చి ఆ సంస్యకు పరిష్కారం చూపించి.. పెద్దన్నగా అండగా ఉంటూ వచ్చారు శత చిత్ర దర్శకుడు దాసరి నారాయణ రావు. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ చిన్న గొడవ అయినా సరే అది ఎలాంటిదైనా సరే దాసరి గారు ప్రత్యక్షమై సమస్య పరిష్కారం చూపించే వారు. ఆపద టైం లో అక్కడ నిలబడి ఉండే వారు. అందుకే ఆయన పరిశ్రమ పెద్ద దిక్కుగా చెబుతుంటారు. ఐతే దాసరి తర్వాత ఆ స్థానం ఎవరు భర్తీ చేయలేదు. కొంతలో కొంత మెగాస్టార్ చిరంజీవిని అందరు పెద్ద దిక్కుగా భావిస్తారు. ఆయనే పెద్దన్నగా భావిస్తూ కొన్ని సమస్యలు ఆయన ముందు ఉంచుతారు. కానీ ఆయన ఒక లీడింగ్ హీరో అయ్యే సరికి అన్ని సమస్యలు ఆయన దగ్గరకు వెళ్లట్లేదు. అంతేకాదు కొన్నిటికి ఆయన కూడా దూరంగా ఉంటున్నారు.
Tollywood ముందుకొచ్చి మాట్లాడే వ్యక్తి ఎవరు లేరా..
ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న విషయాలు చూస్తే దీని గురించి ముందుకొచ్చి మాట్లాడే వ్యక్తి ఎవరు లేరా అని అనిపిస్తుంది. చిరంజీవి ముందుకొచ్చి మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. తన ఇంటి హీరో సమస్యలో ఉన్నప్పుడు చిరంజీవి సైలెన్స్ కి కారణం ఏంటని చెప్పుకుంటున్నారు. ఇలాంటి టైం లో పై పశ్రమ తరపున ఒక వ్యక్తి తన గొంతు విప్పితే బాగుంటుందని పరిశ్రమ వ్యక్తులు చెప్పుకుంటున్నారు.
ఐతే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం ఉంటుంది. ఐతే ఇష్యూ మరీ పెద్ది కాకుండా కాస్త పెద్ద దిక్కుగా మాట్లాడి సమస్యని సాల్వ్ చేస్తే బాగుంటుందని అంటున్నారు. అందుకే దాసరిని గుర్తు చేసుకుంటూ ఆయన ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని అనుకుంటున్నారు. చిరంజీవి పెద్దదిక్కుగా కొందరు నమ్ముతున్నా ఈ టైం లో ఆయన సైలెంట్ గా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మరి ఈ సమస్య గురించి ఎవరు నోరు విప్పుతారు. జరిగిన ఘటన గురించి పరిశ్రమ తరపున ఎవరు ఒకాల్తా పుచ్చుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది. Tollywood, Peddadikku, Chiranjeevi, Silence, Allu Arjun Issue