Tollywood Director : నిర్మాతను నిండా ముంచిన దర్శకుడు.. కోట్లలో నష్టం

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 11 June 2022, 9:00 pm

Tollywood Director : సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. పైకి చూడ్డానికి అంత రంగు రంగులుగా కనిపిస్తుంది. కాని అందులో చీకటి కోణాలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి.. రాజమౌళిలు అవ్వలేరు. నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చిన వారు దిల్ రాజు మాదిరిగా కోట్ల సంపాదించలేరు. ప్రతి ఒక్క క్రాప్ట్‌ లో కూడా కష్టాలు ఉంటాయి. ఇటీవల ఒక నిర్మాతను దర్శకుడు ప్రముఖ హీరోతో సినిమా చేద్దాం అంటూ చెప్పి నిండా ముంచాడట. కథ ను స్టార్‌ హీరోకు వినిపించాను.. ఆయన డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడు అంటూ నిర్మాతకు మాయ మాటలు చెప్పి డబ్బులు లాగాడట.

స్క్రిప్ట్‌ వర్క్ చేద్దాం అంటూ ఆఫీస్ తెరచి.. అసిస్టెంట్స్ కు జీతాలు ఇప్పిస్తూ.. తిరగడానికి ఖర్చు చేయిస్తూ మొత్తంగా కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేయించాడట. చివరకు సినిమా ఇప్పుడు కాదు.. హీరో ఇప్పుడు డేట్లు ఇవ్వను అంటున్నాడు అంటూ చేతులు ఎత్తేశాడట. అదే కథతో మరే హీరోతో అయినా సినిమా తీయవచ్చు కదా అంటూ ఆ నిర్మాత అడిగినా కూడా ఆ హీరోతో అయితేనే తీస్తాను.. లేదంటే ఆ కథను వేరే ఏ ఒక్కరికి కూడా ఇవ్వను అంటూ ఆ దర్శకుడు తేల్చి చెప్పాడట. ఇలాంటివి ఇండస్ట్రీలో ఎన్నో జరుగుతాయి. కాని ఆ నిర్మాత మాత్రం జీర్ణించుకోలేక పోతున్నాడట.

Tollywood Director cheated a producer

Tollywood Director cheated a producer

ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్న నిర్మాత అవ్వడం వల్ల ఆ దర్శకుడిని నిలదీశాడట. దాంతో ఇద్దరి మద్య పెద్ద గొడవ అయ్యింది. ఆ దర్శకుడు నీకు నాకు ఏం సంబంధం అన్నట్లుగా మాట్లాడుతున్నాడట. పూర్తిగా నీతో ప్రాజెక్ట్‌ కు నాకు ఇష్టం లేదు అంటూ తెగేసి చెప్పేశాడట. దాంతో నిర్మాత చేసేది లేక పెద్దల వద్దకు లేదంటే నిర్మాతల మండలిని ఆశ్రయించేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ నిర్మాత ఎవరు.. ఆ దర్శకుడు ఎవరు అనే విషయం లో ముందు ముందు రోజుల్లో వారిలో ఎవరైనా ఒకరు మీడియా ముందుకు వస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

  2. "NCC Army Jobs : అమ్మాయిలకు గుడ్ న్యూస్.. NCC ‘C’ సర్టిఫికెట్‌తో నేరుగా ఆర్మీ ఆఫీసర్ ఉద్యోగాలు"

  3. "Heavy Rain Alert : బిగ్ బ్రేకింగ్‌.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్..!"

  4. "Talliki Vandanam 2026 : ఏపీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. తల్లికి వందనం నిధులు విడుదల.. మీ డబ్బులు వచ్చాయో ఇలా చెక్ చేసుకోండి"

  5. "Fact Check PM KISAN : పీఎం కిసాన్ లేటెస్ట్ అప్‌డేట్‌.. రూ.6,000 పెంపుపై కేంద్రం ఫుల్ క్లారిటీ..!"

  6. "karthika Deepam 2 Today Episode 2026 July 22 : సుమిత్ర ఒక్క ప్రశ్నతో షాక్‌లో సూరజ్.. అసలు నిజం బయటపడబోతోందా?"

  7. "Gold Rate Today : బంగారం కొనేవారికి షాక్.. ఒక్కరోజులో పెరిగిన పసిడి ధరలు.. జూలై 22 రేట్లు ఇవే!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి