Producer : మైత్రి వలన అంత నష్టపోయాం.. నిర్మాత సంచలన కామెంట్స్..!
ప్రధానాంశాలు:
Producer : మైత్రి వలన అంత నష్టపోయాం.. నిర్మాత సంచలన కామెంట్స్..!
Producer : దిల్ రాజు సోదరుడు శిరీష్ తాజాగా మాట్లాడిన మాటలు, బయట పెట్టిన లెక్కలన్నీ కూడా హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. నిర్మాత నాగవంశీతో తమకున్న బంధం గురించి చెప్పడం, మైత్రి మీద ఆరోపణలు చేయడం వంటివన్నీ కూడా చర్చలకు దారి తీస్తున్నాయి. ఇక రామ్ చరణ్ మీద శిరీష్ చేసిన వ్యాఖ్యలు అయితే ఫ్యాన్ వార్‌కు దారి తీస్తున్నాయి.

Producer : మైత్రి వలన అంత నష్టపోయాం.. నిర్మాత సంచలన కామెంట్స్..!
Producer : చాలా నష్టాలు..
మైత్రిలో ప్రతీ సారి ఎక్కువ రేట్లు చెబుతుంటారని, ఆ రేట్లకే కొనాల్సి ఉంటుందని, అక్కడ మాత్రం డిస్ట్రిబ్యూటర్లు ఎంత నష్టపోయినా మైత్రి వాళ్లు పట్టించుకోరు అని శిరీష్ చెప్పుకొచ్చారు. మైత్రి నుంచి తీసుకున్న సవ్య సాచి వల్ల మూడు కోట్లకు పైగా నష్టపోయామని, నాని గ్యాంగ్ లీడర్ , అంటే సుందరానికి వల్ల కూడా రెండు కోట్ల చొప్పున నష్టపోయినట్టుగా చెప్పుకొచ్చారు.
వీటిలో కొంత సర్దుబాటు చేస్తామని చెప్పారు కానీ ఇంత వరకు ఏం చేయలేదని మైత్రి గురించి శిరీష్ అన్నారు.ఉప్పెన టైంలో మైత్రితో కాస్త విబేధాలు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఆ సినిమా నుంచి మైత్రి వాళ్లు సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటామని అన్నారట. పుష్ప రేట్ విషయంలోనూ కాస్త తేడాలు వచ్చాయని శిరీష్ తెలిపారు. ఆచార్య విషయంలో కొరటాల శివ రేటు ఎక్కువగా చెప్పారని.. అందుకే చివరి నిమిషంలో ఆ మూవీని కొనలేదని, అది అలా వరంగల్ శ్రీనుకు వెళ్లి.. పెద్ద నష్టాల్ని తెచ్చి పెట్టిందని శిరీష్ చెప్పుకొచ్చారు.