Tollywood : తెలుగు సినిమా ప్రేక్షకులను తిట్టుకుంటున్న స్టార్‌ ఫిల్మ్ మేకర్స్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tollywood : తెలుగు సినిమా ప్రేక్షకులను తిట్టుకుంటున్న స్టార్‌ ఫిల్మ్ మేకర్స్‌

Tollywood : తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుకోవడం ఫిల్మ్ మేకర్స్ వల్ల కావడం లేదు. తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తున్నారు… వాటిల్లో కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే సక్సెస్‌ అవుతున్నాయి. కొందరు దర్శకులు ఎలా తీసినా కూడా సక్సెస్‌ అవుతూ ఉంటే మరి కొందరు ప్రాణం పెట్టి సినిమాలను తెరకెక్కించినా కూడా అది బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతోంది. ఇప్పుడు టాలీవుడ్‌ లో ఇదే విషయమై పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది. […]

 Authored By aruna | The Telugu News | Updated on :7 August 2022,4:20 pm

Tollywood : తెలుగు సినిమా ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుకోవడం ఫిల్మ్ మేకర్స్ వల్ల కావడం లేదు. తాము అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తున్నారు… వాటిల్లో కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే సక్సెస్‌ అవుతున్నాయి. కొందరు దర్శకులు ఎలా తీసినా కూడా సక్సెస్‌ అవుతూ ఉంటే మరి కొందరు ప్రాణం పెట్టి సినిమాలను తెరకెక్కించినా కూడా అది బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడుతోంది. ఇప్పుడు టాలీవుడ్‌ లో ఇదే విషయమై పతాక స్థాయిలో చర్చ జరుగుతోంది.

మొన్న సీతారామం మరియు బింబిసార సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా విభిన్నమైన జోనర్ లో రూపొందిన సినిమాలు అనే విషయం తెల్సిందే. అయినా కూడా ఆ రెండు సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ సినిమాల నిర్మాతలు కూడా ఊహించని వసూళ్లు రాబోతున్నాయి. ముఖ్యంగా సీతారామం సినిమాను ఏకంగా మణిరత్నం క్లాసిక్ మూవీ గీతాంజలితో పోల్చుతూ చేస్తున్న కామెంట్స్ ఫిల్మ్‌ మేకర్స్ కు కూడా ఆశ్చర్యంను కలిగిస్తున్నాయి.

Tollywood film makers confusion about audience thinking

Tollywood film makers confusion about audience thinking

ఎన్నో సినిమాలు వస్తున్నాయి.. వాటిల్లో ఈ సినిమాల యొక్క ప్రత్యేకత ఏంటో ఏం అర్థం కావడం లేదని.. అయినా కూడా ఎందుకు ఇంతగా ప్రేక్షకులు చూస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఫిల్మ్‌ మేకర్స్ చర్చించుకుంటున్నారు. ఈ ప్రేక్షకుల అభిరుచి ఏంటో అర్థం అవ్వడం లేదు. ఎలాంటి సినిమాలను ఆధరిస్తున్నారో తెలుసుకోవడం కష్టంగా ఉంది. మాస్ సినిమా లను ఇష్టపడుతున్నారని ఆ సినిమాలు తీస్తే ఆడటం లేదు.. కామెడీ సినిమాలు సక్సెస్ అవుతాయి అని తీస్తే ఎఫ్‌ 3 కూడా నిరాశ పర్చింది అంటూ ఫిల్మ్‌ మేకర్స్‌ ఏకంగా ప్రేక్షకుల అభిరుచి తెలుసుకోలేక తిట్టుకుంటున్నారట. కొత్తదనంతో తీస్తే పట్టించుకుంటారా అంటే అది కూడా లేదు. దాంతో ఫిల్మ్‌ మేకర్స్ జుట్టు పీక్కుంటున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది