Sushmitha : చిరంజీవి పెద్ద కూతురుని టార్చర్ చేసిన ఓ హీరో .. అర్ధరాత్రి మెసేజ్లు చేస్తూ ఇలా దొరికిపోయాడు ..! | The Telugu News

Sushmitha : చిరంజీవి పెద్ద కూతురుని టార్చర్ చేసిన ఓ హీరో .. అర్ధరాత్రి మెసేజ్లు చేస్తూ ఇలా దొరికిపోయాడు ..!

Sushmitha : మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖా దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో రామ్ చరణ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక చిరు పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వర్కులోనే బిజీగా ఉంటున్నారు. అయితే ఇటీవల సుస్మిత తండ్రి తో కలిసి ఓ సినిమాకి నిర్మాతగా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అది జరగలేదు. ఇక చిరు రెండో కూతురు శ్రీజ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 October 2023,11:20 am

Sushmitha : మెగా ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖా దంపతులకు ముగ్గురు పిల్లలు. అందులో రామ్ చరణ్ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక చిరు పెద్ద కూతురు సుస్మిత కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వర్కులోనే బిజీగా ఉంటున్నారు. అయితే ఇటీవల సుస్మిత తండ్రి తో కలిసి ఓ సినిమాకి నిర్మాతగా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అది జరగలేదు. ఇక చిరు రెండో కూతురు శ్రీజ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అయితే చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ను మొదట్లో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం చేయాలని భావించారట.

అంతేకాదు అప్పట్లో ఉదయ్ కిరణ్ హీరోగా సుస్మిత ను హీరోయిన్ గా పెట్టి ఓ సినిమా చేయాలని కథ కూడా రెడీ చేశారట. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వీరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కలేదని తెలుస్తుంది. అయితే సుస్మిత ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా రాబోతుందని వార్తలు వచ్చినప్పుడు అప్పట్లో ఉండే ఓ టాలీవుడ్ హీరో సుస్మిత నెంబర్ తీసుకుని ఆమెకు మెసేజ్లు చేస్తూ తన సినిమాలో హీరోయిన్గా చేయమని చెప్పారట. అంతేకాకుండా అర్థరాత్రి కూడా ఆమెను వదలకుండా ఏదో ఒక మెసేజ్ చేస్తూ విసిగించేవాడట. కానీ ఈ విషయం సుస్మిత బయట ఎక్కడా చెప్పలేదట. తమ ఫ్యామిలీ పరువు పోతుందని ఇంట్లో వాళ్లకు చెప్పకుండా తనలో తాను కుమిలిపోయేదట.

Tollywood hero torcher the mega daughter Sushmitha

Tollywood hero torcher the mega daughter Sushmitha

అయితే ఆ హీరో చేసే మెసేజ్లు రోజురోజుకీ హద్దులు మీరడంతో సుస్మితకు ఏం చేయాలో తెలియక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి తన ఫోన్ ఇచ్చి ఆ మెసేజ్లు చూపిస్తూ తను రోజు టార్చర్ చేస్తున్నాడని చెప్పిందట. దీంతో పవన్ కళ్యాణ్ ఏకంగా ఆ హీరో ఇంటికి వెళ్లి నా కూతురికి అలాంటి మెసేజ్లు చేస్తావా అని చితక్కొట్టాడట. దాంతో భయపడి పోయిన ఆ హీరో ఇంటికి వెళ్లి మరి సుస్మితకు క్షమాపణలు చెప్పాడట. ఇక హీరో ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పే వరకు కూడా అతడు టార్చర్ చేస్తున్నాడని ఇంట్లో వాళ్లకి ఎవరికీ తెలియదట. ఇక అప్పట్లో ఈ విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది

aruna

డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక

Polls

తెలంగాణ‌లో కాంగ్రెస్ వ‌స్తే ఎవ‌రిని సీఎం చేసే అవ‌కాశం ఉంది..?

View Results

Loading ... Loading ...