Intinti Gruhalakshmi 24 Oct Today Episode : హనీని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తులసి.. అనాథలు అయిన పరందామయ్య, అనసూయ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 24 Oct Today Episode : హనీని తీసుకొని ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తులసి.. అనాథలు అయిన పరందామయ్య, అనసూయ

 Authored By gatla | The Telugu News | Updated on :24 October 2023,10:31 am

Intinti Gruhalakshmi 24 Oct Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 24 అక్టోబర్ 2023, మంగళవారం ఎపిసోడ్ 1083 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. జాను కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు వచ్చి రాజ్యలక్ష్మిని అడుగుతారు. దీంతో నాకు చెప్పకుండా ఎక్కడికీ వెళ్లదు కదా.. అంటుంది. మేము ఇల్లంతా వెతికాం కానీ.. కనిపించలేదు. చెప్పినంత పని చేసింది. ఇదంతా నీ కొడుకు వల్లనే అంటాడు. దీంతో నాకొడుకు ఏం చేశాడు అంటుంది రాజ్యలక్ష్మి. ఇంతలో విక్రమ్ ను పిలిచి ఎందుకురా ఇలా చేశావు. ఇంతకంటే ఒకేసారి మా పీక పిసికి చంపేయ్ అంటాడు. ఈ ఇంటిని నమ్ముకున్నందుకు మనకు తగిన శాస్తి జరగాల్సిందే అంటుంది జాను తల్లి. విషయం చెప్పకుండా ఎందుకు విక్రమ్ మీద నిందలు వేస్తున్నారు. కలలో కూడా విక్రమ్ ఎవ్వరికీ ఏ అపకారం తలపెట్టడు అంటుంది దివ్య. దీంతో జాను ఇల్లు వదిలి వెళ్లిపోయింది అంటుంది జాను తల్లి. ఎందుకు అంటే.. ఎందుకో నీకు తెలియదా? చేసిన తప్పు ఒప్పుకో. నా కూతురు తిండి తినడం లేదు. అలిగింది. కాస్త నచ్చజెప్పు.. తన ఆరోగ్యం కాపాడు అని నిన్ను బతిమిలాడానా లేదా? అప్పుడు నువ్వు ఏమన్నావు. చచ్చినా పట్టించుకోను అన్నావు కదా. రెండు రోజులు తినకపోతే వచ్చే నష్టమేమీ లేదు అన్నావు అంటాడు.

దీంతో నేను అన్నదాంట్లో తప్పేముంది. ఉన్నమాటే కదా నేను అన్నది అంటాడు విక్రమ్. దీంతో రాజ్యలక్ష్మి కూడా నువ్వు చేసేది తప్పే అంటుంది. దీంతో దివ్య.. విక్రమ్ ను కాపాడే ప్రయత్నం చేస్తుంది. దివ్య వల్లనే విక్రమ్ ఇలా తయారవుతున్నాడు. విక్రమ్ ని రాక్షసుడిని చేస్తుంది అంటాడు. విక్రమ్ ను పెళ్లి చేసుకుంటా అని జాను పంతం పడితే దాని గురించి మీరు మాట్లాడరా? అంటే పంతం పడితే మాత్రం నచ్చజెప్పాలి కానీ.. ఇలా చేస్తారా? ఈ ఇంట్లో నీకో రూల్, జానుకు ఇంకో రూల్ ఉండదు కదా దివ్య అంటుంది రాజ్యలక్ష్మి. ప్రపంచంలో దాన్ని ఎవరు ఏమన్నా జాను పట్టించుకోదు కానీ విక్రమ్ ఏదైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోదు.. అంటాడు జాను తండ్రి. నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు. వెంటనే జానును నువ్వే తీసుకురావాలి అంటుంది జాను తల్లి. దీంతో ఎక్కడికి వెళ్లిందో తెలియకుండా జాను కోసం ఎక్కడని వెతకాలి అంటుంది దివ్య. మేము ఈ ఇంట్లో ఉండటం మీకు ఇష్టం లేకపోతే వెళ్లిపోతాం. మా జానును తీసుకొచ్చి మాకు ఇచ్చిన మరుక్షణమే మీ కళ్లకు కనిపించకుండా వెళ్లిపోతాం అంటుంది జాను తల్లి. దీంతో మీరు వెళ్లిపోతే ఈ అక్క కూడా మీతో పాటు వచ్చేస్తుందిరా. ఇక్కడ ఉండదు అంటుంది రాజ్యలక్ష్మి. ఎందుకు అందరూ కలిసి నన్ను రాక్షసుడిలా చూస్తున్నారు అంటాడు విక్రమ్. తన ప్లాన్ వర్కవుట్ అవుతోందని మనసులో అనుకుంటుంది రాజ్యలక్ష్మి.

intinti gruhalakshmi 24 october 2023 tuesday full episode

Intinti Gruhalakshmi 24 Oct Today Episode : అసలు ఆ రౌడీలు మన ఇంటి మీదికి ఎందుకు వచ్చారు అని తులసిని నిలదీసిన నందు

మరోవైపు రౌడీలను వెళ్లగొట్టిన తర్వాత నందు ఇంటికి వస్తాడు. తులసి ఏం పని చేసిందని తనను మెచ్చుకుంటున్నారు. అసలు ఆ రౌడీలు మన ఇంటి మీదికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. మీ అక్క కాల్ చేయగానే నువ్వు వచ్చావా అని తులసి తమ్ముడిని అంటాడు. దీపక్ నీ సాయం రౌడీలను తరిమికొట్టడం వరకే.. ఇంటి గొడవలో తలదూర్చకు అంటుంది తులసి. దీంతో దీపక్ ఏం మాట్లాడడు.

హనీ విషయంలో ఆ ఇంట్లో వాళ్లు రాజీ పడ్డారని ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతాడు నందు. దీంతో అబద్ధం చెప్పడం ఎంత తప్పో.. నిజం దాచడం కూడా అంతే తప్పు అంటుంది తులసి. హనీ విషయంలో మన ఫ్యామిలీ మెంబర్స్ కు ఆ రత్నప్రభ హానీ తలపెట్టింది. అప్పుడు నువ్వు ఆ నిజం ఎందుకు దాచావు అంటే.. నువ్వు గొడవ పడతావు అని దాచాను అంటాడు నందు. దీంతో ఇప్పుడు నేను చేసింది కూడా అదే అంటుంది తులసి.

నేను మీ మాట వినేదాన్ని కాదు. ప్రతి రోజు గొడవ జరిగేది. ప్రశాంతత కరువయ్యేది. ఒంటరిగా నా తంటాలు ఏవో నేను పెడదామనుకున్నాను అంటుంది తులసి. ఆ లాస్య పగతో రగిలిపోతోంది. ఎంతకైనా తెగిస్తుంది అని అంటాడు నందు. దీంతో నాకెందుకులే అని మీ విడాకుల సమయంలో పట్టించుకోకుండా ఉంటే ఏం జరిగేది. నేను తెగించబట్టే కదా లాస్య పీడ విరగడ అయింది. మరిచిపోయారా అంటుంది తులసి.

అప్పుడు లాస్య నుంచి కాపాడటానికి మీకు సహాయం చేశాను. ఇప్పుడు హనీకి సహాయం చేస్తున్నాను అంటుంది తులసి. నేను హనీ సమానమా అంటే.. అస్సలు కాదు. మీకంటే హనీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటుంది తులసి. మిమ్మల్ని మీరు రక్షించుకునే స్టేజీలో ఉన్నా మీ సమస్యలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. హెల్ప్ చేశాను. కానీ.. హనీ అలా కాదు. అభం శుభం తెలియని పసిపిల్ల. పైగా ఎవ్వరూ లేని అనాథ. తనను తాను రక్షించుకోలేని పరిస్థితిలో ఉంది.

సహాయం చేయాలనుకోవడం, చేయడం తప్పా.. చెప్పండి మామయ్య. చెప్పండి అత్తయ్య. మీ అబ్బాయి ఇలా గొడవ పడతాడని తప్పని తెలిసినా మనసును చంపుకొని అబద్ధం చెప్పాను. అందుకు నన్ను క్షమించండి మామయ్య అంటుంది తులసి.

హనీని ఇక్కడ ఉంచుకోవడం తప్పుడు నిర్ణయం. హనీ ఇక్కడ ఉండటానికి వీలు లేదు అంటాడు నందు. మీ నిర్ణయం అదే అయితే నా నిర్ణయం కూడా వినండి. హనీ ఈ ఇంట్లో ఉండటం కుదరనప్పుడు నేను హనీతో పాటు ఈ ఇల్లు వదిలి వెళ్లిపోతాను అంటుంది తులసి. దీంతో పరందామయ్య, అనసూయ షాక్ అవుతారు.

మరోవైపు జాను ఎక్కడికి వెళ్లిందో అని అందరూ టెన్షన్ పడుతుంటారు. ఇంతలో అక్కడికి జాను వస్తుంది. జానును చూసి అందరూ షాక్ అవుతారు. బయటికి వెళ్లేటప్పుడు చెప్పాలని తెలియదా అంటాడు విక్రమ్. చెబితే ఇదో బాధ.. చెప్పకపోతే ఇంకో బాధ.. అంటుంది జాను. విక్రమ్ పచ్చ బొట్టును చేయి మీద వేయించుకుంటుంది జాను. ఇక బావతో మూడు ముళ్లు వేయించుకోవడమే అంటుంది జాను. దీంతో దివ్యకు ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది