R Narayana Murthy : వాడు కాదు వీడు కాదు పెద్దన్నగా ఆర్‌ నారాయణమూర్తి అన్న ఉండాలి.. మీరు ఏమంటారు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

R Narayana Murthy : వాడు కాదు వీడు కాదు పెద్దన్నగా ఆర్‌ నారాయణమూర్తి అన్న ఉండాలి.. మీరు ఏమంటారు?

 Authored By himanshi | The Telugu News | Updated on :4 January 2022,11:00 am

R Narayana Murthy : మొన్నటికి మొన్న టాలీవుడ్‌ నటీ నటుల సంఘం మా ఎన్నికల సందర్బంగా మా ప్రెసిడెంట్‌ పోస్ట్‌ కోసం నేనంటే నేను అంటూ ఎలా కొట్టుకున్నారో ఇప్పుడు అలాగే ఇండస్ట్రీ పెద్దన్న పోస్ట్‌ కు కూడా చర్చ జరుగుతోంది. అయితే చిరంజీవి మాత్రం ఆ పెద్దన్న పోస్ట్‌ వద్దంటే మోహన్‌ బాబు మాత్రం నేనున్నా అంటూ నామినేషన్‌ పత్రం వేసినట్లుగా ఒక లేఖను ఇండస్ట్రీకి రాశాడు. టికెట్ల రేట్ల విషయంలో జగన్ ప్రభుత్వంను అడగాల్సింది పోయి ఆయన్ను అడిగే దమ్ము ధైర్యం లేదో మరేంటో కాని వచ్చి ఇండస్ట్రీకి మోహన్‌ బాబు లేఖ రాశాడు.ఏదైనా ఉంటే నేరుగా వెళ్లి జగన్‌ ప్రభుత్వంను అడగాలి.. నిలదీయాలి. కాని మోహన్‌ బాబు మాత్రం అలా చేయకుండా హైదరాబాద్‌ లో పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇదే సమయంలో సినిమా థియేటర్ల సీజ్‌ విషయంలో నిర్మాతలు మరియు థియేటర్ల యజమానులు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో ఎర్రన్న ఆర్‌ నారాయణ మూర్తి నేరుగా అమరావతి వెళ్లి సమస్య పరిష్కారంకు ప్రయత్నించాడు. పేర్ని నానిని కలిసిన ఎర్రన్న సీఎం వైఎస్ జగన్‌ తో ఫోన్ లో మాట్లాడాడు. దాంతో వెంటనే సీజన్‌ అయిన అన్ని థియేటర్లను కండీషన్ లేకుండా రిలీజ్‌ చేస్తున్నట్లుగా ప్రకటించారు.నెల రోజుల సమయం ఇచ్చి లైసెన్స్ రెన్యువల్‌ చేయించుకోవాలని సూచించారు. ఇది ఖచ్చితంగా ఆర్ నారాయణ మూర్తి వల్లే జరిగింది అని ఇండస్ట్రీ మొత్తంకు తెలుసు. ఏ ఒక్కరు కూడా ఇలాంటి పని చేయలేదు. ఇక ఆర్ నారాయణ మూర్తి టికెట్ల రేట్ల విషయంలో కూడా పోరాటం చేస్తున్నాడు. ఆయన కమర్షియల్‌ గా సంపాదించుకునే ఆలోచన లేదు. అయినా కూడా నా ఇండస్ట్రీ బాగుండాలని ఆయన కోరుకుంటాడు.

tollywood industry want peddanna like R Narayana Murthy

tollywood industry want peddanna like R Narayana Murthy

R Narayana Murthy : టాలీవుడ్‌ కోసం పని చేసే పెద్దన్న ఆర్‌ నారాయణమూర్తి

ఆయన వంటి నిస్వార్థ పరులు ఇండస్ట్రీ కోసం ఎంతో చేస్తారు. అందుకే అలాంటి వారిని ఇండస్ట్రీ పెద్దన్నగా ముందు ఉంచి నడపాల్సిన అవసరం ఉంది.ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగు జాడల్లో నడిస్తే బాగుంటుంది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని మన స్టార్స్ ఈగో లతో పెద్దన్న పాత్రను మూర్తన్న కు అస్సలు ఇవ్వరు. నారాయణ మూర్తి కనుక ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తే అన్ని వ్యవహారాల్లో కూడా ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వాలతో మాట్లాడుతూ అందరికి సమాన అవకాశాలు.. వినోదం అందరికి దక్కుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రన్న ఆర్ నారాయణ మూర్తి ఇండస్ట్రీ పెద్దగా ఉండాలనే అభిప్రాయంలో మీ అభిప్రాయం ఏంటి మాకు చెప్పండి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది