tollywood movies win at small screen
Tollywood : ఇటీవల టాలీవుడ్‌లో చోటుచేసుకుంటోన్న కొన్ని సంఘటనలు..సమీకరణాలు అనేక అనుమానాలకు తావిస్తుంది. సౌత్ ఇండస్ట్రీకి టాలీవుడ్ హబ్‌గా మారనుందా అంటే అవుననే అనుమానాలు తలెత్తుతున్నాయి. సౌత్ ఇండస్ర్టీలో అతి పెద్ద పరిశ్రమగా తెలుగు..తమిళ పరిశ్రమలకు పేరుంది. ఇప్పుడు టాలీవుడ్ స్థాయి రోజురోజుకు పెరుగుతూ పోతుంది. చూస్తుంటే ఇది సౌత్ సినీ పరిశ్రమ మొత్తానికి హబ్ గా మారనుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సౌత్ సినీ పరిశ్రమలో తెలుగు సినిమా స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి నుండి ఇక్కడి స్థాయి చాలా పెరిగింది. భారీ బడ్జెట్ చిత్రాలు ఇక్కడ రూపొందుతున్నాయి. ముఖ్యంగా సౌత్ నుంచి రిలీజ్ అయ్యే భారీ బడ్జెట్ సినిమాలన్నీ తెలుగు..తమిళ పరిశ్రమల నుంచే కనిపిస్తాయి. అయితే `బాహుబలి` సక్సెస్ తర్వాత తెలుగు పరిశ్రమ రేంజ్ మారింది.
అటుపై రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్` .. `పుష్ప` సినిమాలు పాన్ ఇండియాలో పెద్ద విజయం సాధించడంతో టాలీవుడ్ రెట్టింపు క్రేజ్ తో దూసుకుపోతుంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటోన్న సంకేతాలు అందుకు మరింత బలం చేకూర్చాయి. కోలీవుడ్ నటులు..దర్శకులు తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు పరిశ్రమతో పోటీ పడిన పరాయి పరిశ్రమ నటులిప్పుడు తెలుగు మార్కెట్ కోసం ముందుకు కదులుతున్నారు. తెలుగుతో పాటు ఏక కాలంలో తమిళ్ లోనూ ఆయా చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఒకప్పుడు కేవలం అనువాద రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చే హీరోలిప్పుడు హైదరాబాద్ లో తిష్ట వేసి తమ సినిమాల్ని ప్రత్యేకంగా మార్కెట్ సహా ప్రమోట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అవిభాజిత ఆంద్రప్రదేశ్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఈ ఒరవడి మరింత పెరిగింది. హైదరాబాద్ తో పాటు…వైజాగ్ సిటీలోనూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక కన్నడ నటులు..మలయాళం నటులు తెలుగు హీరోస్ సినిమాల్లో చాలా కాలంగా భాగమవుతున్నారు.
Tollywood is top in the South film industry
ఇటీవల కాలంలో ఆ వేగం మరింత పెరిగింది. తెలుగు సినిమా ఆఫర్ అంటే? సౌత్ నుంచి ఏ నటుడు వదులు కోవడానికి ఇష్టపడటం లేదు. అవసరమైతే తాము హీరోగా నటిస్తోన్న సినిమాలు సైతం పక్కనబెట్టి ముందుకొస్తున్నారు. అలాగే హైదరాబాద్ హబ్ గా పరభాషా సినిమాల షూటింగ్ లు తరుచూ జరుగుతున్నాయి. కనీసం ఒక షెడ్యూల్ అయినా రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించే ప్లానింగ్ తో ముందుకొస్తున్నారు. గడిచిన దశాబ్ధ కాలంలో ఇలాంటి మార్పులెన్నో వచ్చాయి. సాంకేతికంగాను టాలీవుడ్ ఎంతో వృద్దిలోకి వచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్టూడియోల నిర్మాణానికి తల పండిన దిగ్గజాలు ముందుకొస్తున్నారు. బాలీవుడ్ అంటే ఒకప్పుడు తెలుగు సినిమాలని చాలా చిన్న చూపు చూసేవారు. అస్సలు తెలుగు సినిమాలని చాలా లైట్‌గా తీసుకునే వారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. మన సినిమాలని వారు రీమేక్ చేస్తూ హిట్ కొడుతున్నారు. అంతేకాదు నాలుగైదేళ్లగా బాలీవుడ్ సైతం హైదరాబాద్ ని హబ్ గా మార్చకుని తమ సినిమాల్ని ప్రచారం చేసుకుంటోంది. ఇప్పడీ విధానంలోనూ చాలా మార్పులొచ్చాయి.
తెలుగు స్టార్ హీరోల్ని తమ సినిమా ప్రచారంలో భాగం చేస్తున్నారు. రిలీజ్ కి ముందు టాలీవుడ్ సెలబ్రిటీలకు స్పెషల్ షోలు వేస్తున్నారు. కొంత మంది దిగ్గజాల రాకతో టాలీవుడ్-బాలీవుడ్ మధ్య ఉన్న వ్యత్యాసం చెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇలా ఇన్ని రకాల మార్పులతో టాలీవుడ్ స్థాయి..రూపంలో మార్పుల్ని స్పష్టంగా గమనించవచ్చు. చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ హీరోలని బాలీవుడ్ హీరోలు తమ సినిమా ప్రమోషన్స్ కి వాడుకుంటున్నారంటే మన సినిమా స్థాయి ఎక్కడికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. బాలీవుడ్ స్టార్ హీరోలుగా చెప్పుకొనే అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వారు ఇటీవల చిరంజీవి సాయం ఎక్కువగా తీసుకుంటున్నారు. అంతేకాదు చిరు సినిమాలతో పాటు పలు సౌత్ సినిమాలలో వారు నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుదిరితే మన సౌత్ హీరోలని తమ సినిమాలో భాగం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులన్నీ తెలుగు సినిమా గొప్పదనానికి సాక్ష్యంగా నిలుస్తుంది.
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
This website uses cookies.