Ramayanam Did Ravana Know ramudu will kill him
Ramayanam : రామాయణం అందరికీ దిక్సూచి.. ఈ ఒక్క ఇతిహాసం చదివితే మానవ నడవడిక ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది.. ఇంతటి రామాయణంలో మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన అబ్బురపరిచే విషయాలు ఉన్నాయి.. అందులో కొన్నింటిని మనం తెలుసుకుందాం.. రాముడు తన అవతారాన్ని ఎలా ముగించాడు .!? రాముడు తనను చంపుతాడని రావణుడికి తెలుసా.!? ప్రవాస సమయంలో అడవి పేరు..!? గాయత్రి మంత్రం వెనుక ఉన్న కారణం ఏంటి.!? మీకు ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన, చరిత్రకు సంబంధించిన వీడియోలు కావాలంటే ఈ చానెల్ ను ఫాలో అవండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. రాముడు తన అవతారాన్ని ఎలా ముగించాడు .!? రాముడు అశ్వమేధ యాగం చేయాలని తలపెట్టినప్పుడు ఆ యాగానికి సంబంధించిన అశ్వాన్ని లవకుశలు బంధిస్తారు.. ఈ కారణంగా పెద్ద యుద్ధమే జరుగుతుంది.. ఆ సమయంలో సీతాదేవి తన బిడ్డలను వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడు వారిద్దరూ తమ బిడ్డలే అని రాములవారికి తెలుస్తుంది.. ఇంతలో సీతాదేవి లవకుశలను వెతుక్కుంటూ వస్తుంది..
అక్కడ చూసిన రాముల వారికి తన బిడ్డలను అప్పగించి.. తన తల్లి అయిన భూదేవిని తన దగ్గరకు తీసుకు వెళ్ళమని చెబుతుంది.. వెంటనే భూదేవి ప్రత్యక్షమై తన గర్భంలోకి తీసుకొని వెళ్ళిపోతుంది.. లవకుశల ఎంత ప్రయత్నించినా కానీ సీతాదేవి ఉండలేదు.. ఎంతో ప్రేమ మూర్తి అయినా సీతాదేవిని వదులుకున్నందుకు బాధపడుతూ రామలక్ష్మణులు ఇద్దరు తిరిగి అయోధ్య నగరానికి చేరుకుంటారు.. ఆ తరువాత శ్రీరాముడు అయోధ్యను 11వేల సంవత్సరాల పాటు పరిపాలిస్తాడు .. ఆ కాలాన్ని రామరాజ్యం అని పిలిచేవారు.. ఇక శ్రీరాముడు తన అవతారాన్ని ముగించాల్సిన అవసరం వచ్చిందని తెలుసుకుంటాడు.. అందుకు ముందుగా ఆదిశేషుడు అవతారమైన లక్ష్మణుడిని సరయు నదిలోకి పంపి వైకుంఠానికి చేరుకునేలా చేస్తాడు.. తర్వాత తన బాధ్యతలను తన కొడుకులకు అప్పగిస్తాడు.. ఇక రాముడు కూడా సరయు నది లోకి నడుచుకుంటూ వెళ్లి అదృశ్యం అవుతాడు.. అలా రాముడు తన అవతారాన్ని చాలిస్తాడు..
Ramayanam Did Ravana Know ramudu will kill him
రావణుడికి తను ముందే చనిపోతానని తెలుసు ఎందుకంటే ఎంతోమందిని క్రోరంగా రాక్షసంగా హింసించేవాడు తను చేసిన ఈ పాపాల నుంచి మోక్షం పొందాలి అంటే దేవుని చేతిలో మరణించాలి అని భావిస్తాడు రాముడు మనిషి కాదు దేవుడు అని తను నమ్మాడు కాబట్టి రాముడి చేతిలోనే మరణిస్తాను అని తెలుసు కాబట్టి యుద్ధానికి పూనుకున్నాడు అలా చనిపోయే విష్ణు పదాన్ని చేరుకోవాలి అని అనుకుంటాడు..
శ్రీరాముడు మరియు లక్ష్మణుడు కలిసి 14 సంవత్సరాల పాటు వనవాసం చేశారని మన అందరికీ తెలుసు కానీ వాళ్ళు తిరిగిన అటవీ ప్రాంతం పేరు మాత్రం అది కొద్ది మందికి మాత్రమే తెలుసు ఆ ప్రాంతం పేరు దండకారణ్యం ఇది దాదాపుగా 36 వేల 500 చదరపు మైళ్లు లో విస్తరించి ఉంది.. మనదేశంలోనే చత్తీస్గడ్ ఒడిస్సా మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అంతగా అంతట ఈ అడవి విస్తరించి ఉంది పురాణాలను బట్టి చూస్తే ఈ అటవీ ప్రాంతం భయంకరమైన రాక్షసుల నిలయంగా ఉంది శిక్ష అరణ్య అంటే అడవి దండకారణ్యం అంటే రాక్షసులను శిక్షించే ప్రాంతం అని అర్థం.. అందుకే శ్రీరాముడు ఈ అరణ్యాన్ని ఎంచుకున్నాడు అని చెబుతారు..
గాయత్రి మంత్రం ఎంత గొప్పదో ఆ మంత్రం విశిష్టత ఏంటో అందరికీ తెలుసు.. అసలు గాయత్రి మంత్రం ఎలా ఏర్పడిందో.. ఎవరికీ తెలియదు.. అయితే ఎంతో మహాన్వితమైనటువంటి గాయత్రి మంత్రం రామాయణం నుండే పుట్టింది.. రామాయణంలో ప్రతి 1000 స్లోకాల తర్వాత వచ్చే మొదటి అక్షరం నుండి గాయత్రి మంత్రం ఏర్పడింది.. అందుకే ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి.. వాల్మీకి రామాయణంలో మొత్తం 24 వేల శ్లోకాలు ఉంటాయి.. రామాయణంలోని ప్రతి 1000 శ్లోకాలలోని మొదటి అక్షరాలన్నింటినీ కలిపి గాయత్రి మంత్రాన్ని ఏర్పరుస్తుంది.. అందుకే ఈ మంత్రాన్ని ఈ ఇతిహాసం యొక్క సారాంశం గా చెబుతారు.. అంతేకాకుండా మొదట ఈ గాయత్రి మంత్రాన్ని ఋగ్వేదంలో ప్రస్తావించడం జరిగింది..
రామాయణం చివరి దశకు చేరుకునేటప్పటికీ.. లంకను జయించడానికి ఒక వంతెనను నిర్మించాలి అని అనుకుంటాడు రాముడు.. లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటి వెళ్ళాలి.. అందుకోసం వానర సైన్యాన్ని సహాయం కోరుతాడు రాముడు.. వానర సైన్యం లంకకు ఒక వారధి కట్టింది.. దీని పేరే రామసేరామాయణం చివరి దశతు.. హనుమంతుడు 10 మిలియన్ల మంది వానర సైన్యంతో కలిసి రామసేతును కేవలం ఐదు రోజులలోనే నిర్మించారు అని చెబుతారు.. అయితే ఈ కథ ఎప్పటిది కాదు దాదాపు 17 లక్షల 50 వేల సంవత్సరాల క్రితం నాటిది అని పురాణాలు చెబుతున్నాయి.. కానీ ఇటీవల శ్రీలంక భారతదేశం మధ్య ఈ రెండు దేశాలను కలిపే ఇనిస్టెంట్ మ్యాన్ మేడ్ బ్రిడ్జ్ ఒకటి ఉందని కనుగొన్నారు.. దానిని నాసా వాళ్ళు ఆడమ్స్ బ్రిడ్జిగా పేర్కొన్నారు..
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.