Tollywood Hero : ఆ ముసలి హీరో వయసు కనిపించకుండా ఉండేందుకు గ్రాఫిక్స్ కు కోట్లు ఖర్చు చేస్తున్నారట!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 26 June 2022, 10:00 am

Tollywood Hero : టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల్లో ఎక్కువ శాతం మంది నాలుగు.. అయిదు పదుల వయసు దాటిన వారే ఉన్నారు. ఏడు పదుల వయసుకు దగ్గర పడ్డ వారు కూడా స్టార్స్ మరియు సూపర్ స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు. వారు కూడా ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నారు. టాలీవుడ్ సీనియర్ స్టార్‌ హీరోలతో పాటు యంగ్‌ స్టార్ హీరోల వయసు కూడా ముదిరి పాకాన పడుతుంది అన్నట్లుగా మారింది. పలువురు హీరోలు ముఖం ముసలి మొహంగా మారింది. ఈ విషయంలో సినిమా మేకర్స్ కు పెద్ద టాస్క్ గా మారింది. నాచురల్ గా చూపించాలని దర్శకులు అనుకుంటూ ఉన్నా కూడా హీరోలు మాత్రం తమ ఒరిజినల్ ను చూపించేందుకు ఇష్టపడటం లేదు.

హీరోల కోరిక మేరకు మేకప్‌ తో సగం వయసును గ్రాఫిక్స్ తో మరింత వయసును దాచేందుకు నిర్మాతలు మరియు దర్శకులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ఒక సీనియర్ హీరో నటిస్తున్న సినిమా షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆ సినిమా యొక్క పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టారు. హీరో పాత్ర ముసలి ఛాయలను పోగొట్టేందుకు గాను దర్శకుడు గ్రాఫిక్స్ టీమ్ కు తమ సినిమా ఫుటేజ్ ను ఇవ్వడం జరిగిందట. ఆ గ్రాఫిక్స్ కంపెనీ వారు సదరు సినిమా లో హీరో పాత్ర కు విజువల్‌ ఎఫెక్ట్స్ చేసేందుకు దాదాపుగా అయిదు కోటల రూపాయలు డిమాండ్‌ చేశారట.

tollywood senior hero face graphics

tollywood senior hero face graphics

హీరో పారితోషికం నుండి తగ్గించి ఇవ్వాలని నిర్మాత కోరుతున్నాడు. అందుకు ఆ హీరో ఒప్పుకోవడం లేదు.. అలా అని గ్రాఫిక్స్ లేకుండా విడుదల చేసేది లేదు అంటున్నాడు. దాంతో దర్శకుడు ఆ అయిదు కోట్ల రూపాయల్లో రెండు కోట్లు తాను ఖర్చు పెట్టుకునేందుకు సిద్దం అయ్యాడట. మిగిలిన మూడు కోట్లను నిర్మాత ఖర్చు చేయాల్సి ఉంటుందట. మొత్తానికి ఇప్పటికే సినిమాల బడ్జెట్‌ లు భారీగా పెరిగాయి అంటూ ఉంటే ఇప్పుడు ఇది ఒకటి కొత్తగా తయారు అయ్యింది అంటూ నిర్మాతలు గగ్గోలు పెడుతూ ఉన్నారు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  2. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  3. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  4. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  5. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

  6. "Uppal Congress : ఉప్పల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన.. రాహుల్ గాంధీ అరెస్టుపై ఆగ్రహం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్"

  7. "NEET Protest Delhi : నీట్ ఆందోళనలో కొత్త ట్విస్ట్.. విద్యార్థుల సమస్యా? రాజకీయ పోరాటమా..? సీజేపీ నాయకులు ఎక్కడ?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి