Tollywood Hero : ఆ హీరో అడుగుతున్న పారితోషికంతో భయపడుతున్న నిర్మాతలు
Tollywood Hero : టాలీవుడ్ లో హీరోల పారితోషికం అమాంతం పెరిగి పోయింది. నాలుగు అయిదు సంవత్సరాల ముందు వరకు కూడా పది కోట్ల పారితోషికం అంటే గొప్ప విషయం అన్నట్లుగా ఉండేది. కాని ఇప్పుడు మీడియం రేంజ్ హీరోలు కూడా పది కోట్లు డిమాండ్ చేస్తున్నారు. హీరోల పారితోషికం ఒక ఎత్తు అయితే సినిమాల మేకింగ్ మరో ఎత్తు అవుతుంది. సినిమా ల మేకింగ్ భారీగా పెరగడంతో పాటు హీరోల పారితోషికం విపరీతంగా పెరగడం వల్ల నిర్మాతలు జుట్టు పీక్కుంటున్నారు.పెద్ద హీరోలు సినిమా లు హిట్ అయినా ఫట్ అయినా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇతర బిజినెస్ ల ద్వారా సినిమా లకు పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం ఉంది.
కాని మీడియం రేంజ్ హీరోల సినిమా లు థియేటర్ లో నడిచి వసూళ్లు దక్కించుకుంటేనే నిర్మాతకు లాభం. ఇప్పుడు ఒక యంగ్ హీరో డిమాండ్ చేస్తున్న పారితోషికం నిర్మాతలకు షాకింగ్ గా ఉందట. ఆయన మార్కెట్ కనీసం 10 నుండి 15 కోట్లు ఉండదు. అయినా కూడా పారితోషికం మాత్రం 15 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నాడట. మొన్నటి వరకు 5 నుండి 7.. 8 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ వచ్చిన ఆ యంగ్ హీరో ఇటీవల వచ్చిన సక్సెస్ తో తన పారితోషికంను అమాంతం పెంచేశాడట. ఆ సినిమా పాతిక కోట్లు వసూళ్లు చేయడం తో ఇక తన సినిమాలన్నీ కూడా అదే రేంజ్ అన్నట్లుగా ఫీల్ అవుతున్నాడట. అందుకే తనకు ఇక నుండి 15 కోట్ల పారితోషికం కావాల్సిందే అంటున్నాడట.

tollywood young hero demanding big remuneration for small movies
ఇటీవల ఒక నిర్మాత మంచి కాన్సెప్ట్ బేస్డ్ స్క్రిప్ట్ పట్టుకుని ఆ హీరో వద్దకు వెళ్లగా కథ ఎవరికి కావాలి.. 15 కోట్లు పారితోషికం కావాలి అన్నాడట. దాంతో నిర్మాత సైలెంట్ గా అక్కడ నుండి వచ్చేశాడట. ఆయన తో 15 కోట్ల తో సినిమా తీస్తేనే వెనక్కు వచ్చేది అనుమానం. అలాంటిది ఆయనకే 15 కోట్లు ఇచ్చి.. మరో 10 కోట్లు మేకింగ్ కు ఖర్చు చేసే మొత్తం పాతిక కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అంత సీన్ ఆ హీరోకు లేదు అనేది సదరు నిర్మాత అభిప్రాయం. అందుకే ఆయనతో సినిమా చేసే విషయంలో ఆలోచన మార్చుకున్నాడట. ఇలా భారీ పారితోషికం డిమాండ్ చేస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఆఫర్లు లేక దిక్కులు చూడాల్సిన పరిస్థితి వస్తుందంటూ కొందరు సినీ వర్గాల వారు ఆయన్ను హెచ్చరిస్తున్నారు.