Tollywood Hero : వీళ్లు అభిమానులు కాదు.. ఛీ ఛీ ఫ్యాన్స్ ని హీరో కూడా అదుపులో పెట్టుకోలేడా!
Tollywood Hero : టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు అరాచకాలకు పాల్పడుతున్నారు. ఆ హీరో ఈ హీరో అనే తేడా లేకుండా ప్రతి ఒక్క హీరో యొక్క అభిమానులు సోషల్ మీడియా ద్వారా అసభ్యకర పరిస్థితుల్లో.. అసభ్యకర పదజాలంతో ఇతర హీరోలను అవమానించడం దూషించడం చేస్తున్నారు. ఇక తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భాల్లో లేదా తమ అభిమాన హీరో నటించిన సినిమా విడుదల సమయంలో వారు చేస్తున్న హడావుడి అంతా కాదు. తాజాగా ఒక స్టార్ హీరో అభిమానులు చేసిన పనితో ఏకంగా థియేటర్ యాజమాన్యం దాదాపుగా పాతిక లక్షల రూపాయలను నష్టపోయినట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే ఒక స్టార్ హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన సినిమాని ప్రత్యేకంగా విడుదల చేశారు.
ఆ సమయంలో సినిమా థియేటర్లో గందరగోళ వాతావరణం ఏర్పడింది. అభిమానులు కొందరు సౌండ్ సరిగా రావడం లేదంటూ నానా హంగామా చేశారు. కొందరు అభిమానులు ఏకంగా థియేటర్లపై రాళ్ల దాడి కురిపించడంతో పాటు సీట్లను ఇష్టానుసారంగా విరగొట్టారు. అంతే కాకుండా స్క్రీన్ వద్ద హంగామా సృష్టించారు. ఈ మొత్తం వ్యవహారంతో సదరు థియేటర్ యాజమాన్యానికి భారీ నష్టం చేకూరిందంటూ స్థానికులు చెబుతున్నారు. ఆ హీరో అభిమానులు ఇలా చేయడం ఇదే ప్రథమం ఏమీ కాదు.. గతంలో పలు సార్లు కూడా ఇలాంటి వ్యవహారాల్లో వాళ్ళు తలదూర్చారు. ఎప్పటిలాగే ఆ హీరో మరియు ఆయన అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి అయితే చేస్తున్నారు కానీ వివాదాలకు చెప్పి పెట్టడం లేదు.
తన అభిమానులను అదుపులో ఉంచుకోవలసిన బాధ్యత ఆ హీరోకి ఉంది. అయినా కూడా ఆ హీరో ఇప్పటి వరకు అభిమానులను ఉద్దేశించి సమయం పాటించాలని సూచించిన దాఖలాలే లేవు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారికి అభిమానులు ఉన్నారు. వారిలో చాలా మంది ఇలాంటి అత్యుత్సాహపు పనులు చేస్తున్నారు. వారందరికీ కూడా ఆయా స్టార్ హీరోలు కాస్త జాగ్రత్తలు చెప్తే మంచిది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం వారు చెప్పిన వినే పరిస్థితిల్లో అభిమానులు లేరు అంటున్నారు. ఇప్పటికే ఆ హీరో ఎవరో మీకు అర్థమై ఉంటుంది.