Salman Khan : టాలీవుడ్ సీనియర్ హీరోలకు సల్మాన్ ఖాన్ సపోర్ట్ బాగానే ఉందిగా..

Authored By vamana sai | The Telugu News | Published on: May 15, 2022, 10:00 am

Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరోలలో ఎక్కువగా మన తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తుందీ అంటే బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. అంతకముందు కింగ్ నాగార్జున ఫ్యామిలీ అందరూ కలిసి నటించిన మనం సినిమాలో బిగ్ బి చిన్న రోల్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. అయితే, అదే అమితాబ్ బచ్చన్..బాలయ్య సినిమాలో చేయమంటే మాత్రం ఎందుకో నో చెప్పారట. దాంతో ఏకంగా ఆ ప్రాజెక్టే పక్కన పడింది. ఇక బిగ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ క్వీన్ దీపిక పడుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న పాన్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్ కె లో నటిస్తున్నారు.

అయితే, ఇప్పుడు బిగ్ బి వరుసలోనే మరో బాలీవుడ్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరారు. ఆయన ఈ మధ్య మన టాలీవుడ్ స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రాలలో కీలక పాత్రను పోషించేందుకు ఏమాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటించారు. ఇక ఈ మూవీకి సంబంధించి బ్యాలెన్స్ ఉందీ అంటే చిరు – సల్మాన్‌లపై చిత్రీకరించాల్సిన సాంగ్ ఒక్కటే. ఈ సాంగ్ సినిమాకు చాలా హైలెట్ అవుతుందని ఇప్పటికే సాంగ్ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిందని సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ వెల్లడించాడు.

Tollywood senior hero Salman Khan support

Tollywood senior hero Salman Khan support

Salman Khan : పాన్ ఇండియన్ సినిమాలంటూ సాహసం – రిస్క్ రెండు చేయలేరు.

అయితే, సల్మాన్ మరో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్‌తో కలిసి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను జూన్ మొదటి వారం నుండి మొదలుపెట్టబోతున్నారట. కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఇందులో సల్మాన్ – వెంకీ కలిసి ఒకే ఫ్రేంలో కనిపించబోతుండటం అభిమానుల్లో మాత్రమే కాక అందరిలోనూ సూపర్ ఎగ్జైట్‌మెంట్‌ను పెంచేస్తుంది. మెగాస్టార్, వెంకీలాంటి వారు ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాలంటూ సాహసం – రిస్క్ రెండు చేయలేరు. కాబట్టి, వీరికి సల్మాన్ సపోర్ట్ దొరికే గ్యారెంటీగా బాలీవుడ్‌లో రిలీజ్ చేసేందుకు పెద్ద అవకాశం లభిస్తుంది. అదే సల్మాన్ ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలకు సైన్ చేస్తూ సపోర్ట్ చేస్తున్నాడు.

vamana sai

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp