Rashmika Mandanna : రష్మికని వదలని సల్మాన్… సికిందర్ నెక్స్ట్ సినిమా కూడా ఆమె ఫిక్స్.. ఏం జరుగుతుంది..?
ప్రధానాంశాలు:
Rashmika Mandanna : రష్మికని వదలని సల్మాన్... సికిందర్ నెక్స్ట్ సినిమా కూడా ఆమె ఫిక్స్.. ఏం జరుగుతుంది..?
Rashmika Mandanna : బాలీవుడ్ లో మన నేషనల్ క్రష్ రష్మిక బిజీగా మారిపోయింది. యానిమల్ హిట్ తో రష్మిక రేంజ్ పెరగ్గా పుష్ప 2 బ్లాక్ బస్టర్ కొట్టడంతో రష్మిక వరుస క్రేజీ ఛాన్స్ లు అందుకుంటుంది. ప్రస్తుతం అమ్మడు సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమా చేస్తుంది. మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో రష్మిక జతగా నటిస్తుంది.ఐతే సినిమా చేస్తున్న టైం లోనే రష్మిక సినిమా పట్ల చూపిస్తున్న అంకిత భావం చూసి సల్మాన్ ఖాన్ ఇంప్రెస్ అయ్యాడట. వెంటనే తన నెక్స్ట్ సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్ గా తీసుకోమని చెప్పారట. సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమా అట్లీ డైరెక్షన్ లో రాబోతుంది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని రిఫర్ చేశాడట సల్మాన్ ఖాన్.
Rashmika Mandanna : రెండు సినిమాల్లో హీరోయిన్ గా..
సికిందర్ కాంబో మరో సినిమా చేస్తుందని తెలుస్తుంది. మురుగదాస్ తో సల్మాన్ చేస్తున్న సికిందర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ఆ తర్వాత అట్లీ తో చేసే సినిమా కూడా యాక్షనే కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని తెలుస్తుంది. రష్మిక మందన్నానే ఈ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటించడం ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
సల్మాన్ ఖాన్, రష్మిక కాంబో రాబోతున్న రెండు సినిమాల్లో కనిపించనుంది. ఇవే కాకుండా రషిక గర్ల్ ఫ్రెండ్, ధనుష్ తో కుబేర సినిమాలు చేస్తుంది. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా రష్మిక తన సినిమాలతో అదరగొడుతుంది. అమ్మడి ఫాం చూస్తుంటే మిగతా హీరోయిన్స్ అంతా కుళ్లు కునేలా ఉందని చెప్పొచ్చు. రష్మిక ఏం చేసినా సరే ఆ సినిమా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది. అందుకే అమ్మడికి ఈ రేంజ్ లో పాపులారిటీ వచ్చింది. బాలీవుడ్ ఆడియన్స్ కూడా రష్మిక కావాలని కోరుతున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక విక్కీ కౌశల్ తో చావా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. Salman Khan, Rashmika Mandanna, Animal, Kubera, Sikindar, Bollywood