Tollywood Senior Heros : ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సరే.. హీరోలు మాత్రం 60 దాటినా కూడా హీరోగా నటిస్తుంటారు. కానీ.. హీరోయిన్లు అలా కాదు కదా. మూడు పదుల వయసు దాటితే చాలు.. ఇక వాళ్లను ఎవరు పట్టించుకుంటారు. హీరోయిన్లకు అలాంటి చాన్స్ ఉండదు కదా. 60 దాటినా హీరోయిన్ గా నటించడం వాళ్లకు కుదరదు. అందుకే.. ఒక ఏజ్ దాటిన హీరోలకు హీరోయిన్ల కొరత ఎప్పటికీ ఉంటుంది. ఉదాహరణకు మెగాస్టార్ చిరంజీవిని తీసుకున్నా.. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, రవితేజ లాంటి సీనియర్ హీరోలను తీసుకుంటే వాళ్ల ఏజ్ కు సరిపడ హీరోయిన్ కావాలంటే ఈరోజుల్లో కష్టమే.
మూడు పదుల వయసు దాటిన హీరోయిన్లు ఎంతమంది ఇంకా ఇండస్ట్రీలో హీరోయిన్ గా చలామణి అవుతున్నారు. చాలా తక్కువ మంది. అందుకే సీనియర్ హీరోలు అయినా సరే.. కుర్ర హీరోయిన్ల వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. నిజానికి 16 ఏళ్ల వయసు ఉన్నా చాలు ఇండస్ట్రీలో హీరోయిన్ అయిపోవచ్చు. కానీ.. మూడు పదుల వయసు దాటిందంటే ఇక ఆ నటిని ఎవ్వరూ పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా.. ఏదో సైడ్ క్యారెక్టర్స్ ఇస్తారు కానీ.. మెయిన్ లీడ్ ఇవ్వడం కష్టం. నిజానికి కుర్ర హీరోయిన్లతో స్టెప్పులేస్తేనే సీనియర్ హీరోల సినిమాలకు కూడా కాస్తో కూస్తో పాపులారిటీ వస్తుంది.
ప్రస్తుతం శృతి హాసన్ లాంటి కుర్ర హీరోయిన్ తో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ స్టెప్పులేస్తున్నారు. నిజానికి కుర్ర హీరోయిన్లకు ఉన్న డిమాండే వేరు. ఆ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే సీనియర్ హీరోలు కూడా వాళ్లే కావాలని పట్టుపడుతున్నారట. నిన్న కాక మొన్న వచ్చిన కృతి శెట్టి, శ్రీలీల లాంటి హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికే హీరోలు ఇష్టపడుతున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త వయసు పెరిగిన హీరోయిన్లకు మాత్రం ఛాన్సులు రావడం లేదు. అలాంటి హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి కూడా హీరోలు వెనకాడుతున్నారు. అందుకే కుర్ర హీరోయిన్లకు డిమాండ్ పెరుగుతోంది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.