Varalakshmi : వరలక్ష్మీ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ నే పడేసింది.. ఇక అవార్డులే అవార్డులు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Varalakshmi : వరలక్ష్మీ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ నే పడేసింది.. ఇక అవార్డులే అవార్డులు..!

Varalakshmi : వరలక్ష్మీ టాలీవుడ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ అందుకొని వరలక్ష్మీ దర్శక, నిర్మాతల దృష్ఠిని తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా తెలుగులో నెగిటివ్ రోల్స్ .. గాని లేడీ విలన్ క్యారెక్టర్స్ గానీ.. సినిమాలో వేయిట్ ఉన్న క్యారెక్టర్ గాని ఉంటే మేకర్స్ ముందు వరలక్ష్మీ పేరే పరిశీలిస్తున్నారు. దాదాపు 8 ఏళ్ళ నుంచి తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అక్కడ నటిగా […]

 Authored By govind | The Telugu News | Updated on :1 March 2021,5:30 pm

Varalakshmi : వరలక్ష్మీ టాలీవుడ్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ అందుకొని వరలక్ష్మీ దర్శక, నిర్మాతల దృష్ఠిని తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా తెలుగులో నెగిటివ్ రోల్స్ .. గాని లేడీ విలన్ క్యారెక్టర్స్ గానీ.. సినిమాలో వేయిట్ ఉన్న క్యారెక్టర్ గాని ఉంటే మేకర్స్ ముందు వరలక్ష్మీ పేరే పరిశీలిస్తున్నారు. దాదాపు 8 ఏళ్ళ నుంచి తమిళంలో పలు సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అక్కడ నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

tollywood star director focuses on varalakshmi

tollywood star director focuses on varalakshmi

అయితే తెలుగులో మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో వచ్చిన క్రేజ్ ఇప్పటి వరకు తమిళ సినిమా ద్వారా కూడా రాలేదని స్వయంగా వరలక్ష్మి నే స్వయంగా వెల్లడిచింది. క్రాక్ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో నటించిన వరలక్ష్మీ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. విమర్శకుల ప్రశసంలు అందుకుంది. గోపీచంద్ మలినేని ఈ క్యారెక్టర్ కోసం పలువురు పేర్లని పరిశీలించిన తర్వాత ఫైనల్ గా వరలక్ష్మి కి అవకాశం ఇచ్చాడు. దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది.

Varalakshmi : వరలక్ష్మీ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ తయారవుతున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమా తర్వాత వచ్చిన అల్లరి నరేష్ నాంది సినిమా కూడా వరలక్ష్మీ కి చాలా మంచి పేరు తీసుకు వచ్చింది. ఈ రెండు సినిమాలతో టాలీవుడ్ లో పెద్ద బ్యానర్స్ నుంచి అద్భుతమైన పాత్రలు చేయమని అడుగుతున్నారట. ముఖ్యంగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ నే వరలక్ష్మీ తన పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసి ఆకట్టుకుంది. అందుకే అల్లు అర్జున్ తో కొరటాల శివ చేయబోయే నెక్స్ట్ సినిమాలో మంచి క్యారెక్టర్ రాశాడని సమాచారం. ఈ క్యారెక్టర్ లో వరలక్ష్మీ అదరగొడుతుందని కొరటాల శివ గట్టి నమ్మకంతో ఉన్నాడట. ఈ రకంగా చూస్తే టాలీవుడ్ లో వరలక్ష్మీ కోసం ప్రత్యేకంగా క్యారెక్టర్స్ తయారవుతున్నాయని తెలుస్తోంది.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది