Tollywood villains : టాలీవుడ్ Tollywood villainsలో గానీ, బాలీవుడ్‌లో గానీ కోలీవుడ్ లో గానీ..ఇండస్ట్రీ ఏదైనా హీరోకి ధీటైన విలన్ ఉంటేనే హీరో రేంజ్ ని బాగా ఎలివేట్ చేయొచ్చు. కథలో హీరో పాత్రకు ఎదురుగా ఉండే విలన్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటే హీరోకి అంత వెయిట్ ఉంటుంది. అందుకే గత కొన్నేళ్ళుగా మన తెలుగు సినిమాలలో విలన్ లది ప్రధాన పాత్ర అవుతోంది. ఇంకా చెప్పాలంటే హీరోకి సమానంగా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అంతే డిమాండ్ కూడా విలన్ రోల్ చేస్తున్నవాళ్ళకి ఉంది.
ఒకరకంగా ఇండస్ట్రీలో ఇప్పుడున్న వాళ్ళు కాస్ట్లీ విలన్లే. 2 నుంచి మూడు కోట్లు అందుకుంటున్న స్టార్ విలన్స్ కూడా ఉన్నారు.ఇప్పుడు ఆ లిస్ట్ వారు అందుకునే రెమ్యునరేషన్ ఏంటో చూద్దాం. జగపతిబాబు: టాలీవుడ్ లో శోభన్ బాబు లాంటి ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ హీరో. ఈ హీరో విలన్ పాత్రలతో చాలా బిజీగా ఉన్నాడు. స్టైలిష్ ఫాదర్ లాంటివి మధ్యలో నటిస్తున్నాడు. జగ్గుభాయ్ ఒక్కో సినిమాకు కోటి నుంచి కోటిన్నర వరకు తీసుకుంటున్నాడని టాక్.
శ్రీకాంత్ : ఈయన కెరీర్ మొదట్లో విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్టార్ హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. టాలీవుడ్ లో చాలా తొందరగా వంద సినిమాలు చేసిన హీరో శ్రీకాంత్. గత కొంతకాలంగా సినిమాలు తగ్గిపోయాయి.ఇప్పుడు బాలయ్య అఖండ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు కోటికి పైగానే అందుకుంటున్నాడు.
ప్రకాశ్ రాజ్: ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ నెగిటివ్ రోల్స్ అండ్ ఫాదర్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. టాలీవుడ్లో ఒకదశలో అయితే ప్రకాష్ రాజ్ లేకుండా సినిమా ఉండేది కాదు. అంత క్రేజ్ ఉన్న ఈయన ఒక్క రోజుకు 10 లక్షలకు వరకు అందుకుంటున్నాడు. ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సి వస్తే మాత్రం కొన్ని సినిమాలకు కోటిన్నర వరకు నిర్మాతలు ఆఫర్ చేస్తున్నారు.
సోనూ సూద్: అచ్చం హీరోలా ఉండే ఈ రియల్ హీరో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్నాడు. తెలుగులో సూపర్ సినిమా ఆ తర్వాత చేసిన అరుంధతి సినిమా నుంచి భారీగా రెమ్యునరేషన్ పెరుగుతూ వస్తోంది. సోను ఇప్పుడు ఒక్కో సినిమాకు 3 కోట్ల వరకు తీసుకుంటున్నాడట. ఇక మిర్చి సంపత్ రాజ్ కూడా మొదటి సినిమాతో స్టార్ విలన్‌గా పాపులర్ అయ్యాడు. ఈయన కి తెలుగు సినిమాలలో భాగానే క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ వల్లే ఒక్కో సినిమాకు 40 లక్షల రెమ్యునరేషన్ ఇస్తున్నారట.
సాయి కుమార్ : నటుడిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్టు గానే ఈయన సంపాదన ఎక్కువగా ఉంటుందట. డైలాగ్ కింగ్ గా పాపులర్ అయిన సాయి కుమార్ విలన్ అయినా.. సపోర్టింగ్ రోల్ అయినా సినిమాకు 50 లక్షలు తీసుకుంటున్నాడని టాక్ ఉంది. సుదీప్: కన్నడ సూపర్ స్టార్ అయిన సుదీప్ ఇతర భాషల్లో విలన్‌గా నటిస్తున్నాడు. ఒక్కో సినిమాకు 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు.
సుదీప్: కన్నడ సూపర్ స్టార్ అయిన సుదీప్ ఇతర భాషల్లో విలన్‌గా నటిస్తున్నాడు. తెలుగులో ఈగ సినిమాతో బాగా పాపులారిటీని సంపాదించుకున్నాడు. సైరాలో మంచి రోల్ పోషించాడు. ప్రస్తుతం ఈయనకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఒక్కో సినిమాకు 3 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట.
ఆది పినిశెట్టి: హీరోగా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూనే మరొకవైపు సరైనోడు వంటి సినిమాలలో స్టైలిష్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆది ఒక్కో సినిమాకు కోటికి పైగానే తీసుకుంటున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం లాంటి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు చేస్తున్నాడు. నిన్నుకోరి లాంటి సినిమాలలో సెకండ్ హీరోగా నటిస్తున్నాడు.
రవికిషన్: భోజ్‌పురి సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా క్రేజ్ ఉన్న ఈయనకి తెలుగులో స్టార్ విలన్ గా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ సినిమాకు 40 లక్షల వరకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు. హరీష్ ఉత్తమన్: కోలీవుడ్ సినిమాలలో విలన్ గా మంచి పేరున్న ఈ నటుడుకి తెలుగులో బాగా పాపులారిటీ వచ్చింది. ఒక్కో సినిమాకు 30 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. వివేక్ ఒబేరాయ్ కి 3 కోట్లు, నీల్ నితిన్ ముఖేష్ కి 2 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తున్నారట. అయితే ఈ మధ్య కాస్త పరభాషా విలన్ల హవా తగ్గింది. జగపతి బాబుకే ఎక్కువగా అవకాశాలు అందుతున్నాయి. ఆ తర్వాత కూడా టాలీవుడ్ హీరోలకే విలన్ పాత్రలు వరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి ==> SS Rajamouli : నేను 100 శాతం హాలీవుడ్ సినిమా సీన్స్ కాపీ కొడతా.. అసలు నిజం బయటపెట్టిన ఎస్ఎస్ రాజమౌళి?
ఇది కూడా చదవండి ==> Tollywood : స్క్రీన్ మీద సొంత అక్కా చెల్లెళ్ళుగా నటించిన 11 మంది స్టార్ హీరోయిన్స్ వీరే
ఇది కూడా చదవండి ==> Sri Reddy : జగన్ గారు మీరే నన్ను ఆదుకోవాలి.. డబ్బుల కోసమే ఆ వీడియోలు చేస్తున్నానంటున్న శ్రీరెడ్డి?
ఇది కూడా చదవండి ==> Jabardasth : చిరంజీవితో పాటే ఇండస్ట్రీకి వచ్చిన జబర్దస్త్ నటుడు ఎవరో తెలుసా?
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.