SS Rajamouli : నేను 100 శాతం హాలీవుడ్ సినిమా సీన్స్ కాపీ కొడతా.. అసలు నిజం బయటపెట్టిన ఎస్ఎస్ రాజమౌళి?

Advertisement

SS Rajamouli : ఎస్ఎస్ రాజమౌళి.. ఆయనో ప్రభంజనం. తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేశారు రాజమౌళి. తెలుగు సినిమా అంటే ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది. బాహుబలి సినిమా ప్రపంచ సినిమా రికార్డులనే తిరగరాసింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనేది మరో ప్రభంజనం. ఆ సినిమా మరోసారి ప్రపంచ సినిమా రికార్డులను తిరగరాసేందుకు రెడీ అవుతోంది. ఎస్ఎస్ రాజమౌళి అనే పేరు ఇప్పుడు భారతదేశ సినీ చరిత్రలోనే ఓ బ్రాండ్ గా మారింది.

tollywood director ss rajamouli about his films
tollywood director ss rajamouli about his films

ఎస్ఎస్ రాజమౌళి చాలా రిజర్వ్ డ్. ఆయనకు సినిమా మీద ఉన్న పాషనే వేరు. ఆయన ఎప్పుడూ సినిమాలోకంలోనే ఉంటారు. ఎక్కువగా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరు. కానీ.. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్ఎస్ రాజమౌళి తన పర్సనల్ విషయాలతో పాటు.. తన సినిమాల గురించి కూడా ప్రేక్షకులతో పంచుకున్నారు.

Advertisement

SS Rajamouli : నాకు కథలు చెప్పడం బాగా అలవాటు

నాకు కథలు చెప్పడం బాగా అలవాటు. చిన్నప్పటి నుంచి నాకు కథలు చెప్పడం అలవాటు అయింది. కథల పుస్తకాలు చదవడం కూడా బాగా అలవాటు అయింది. కథలను నాకు నచ్చినట్టుగా మార్చుకొని నా ఫ్రెండ్స్ కు, స్కూల్ లో చెప్పేవాడిని. అలా నాకు కథల మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది.. అంటూ ఎస్ఎస్ రాజమౌళి చెప్పుకొచ్చారు. అయితే.. ఒకానొక సమయంలో నాన్న ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం.. సినిమా ఎడిటింగ్ ఆఫీసులో చేరారట రాజమౌళి.

tollywood director ss rajamouli about his films
tollywood director ss rajamouli about his films

SS Rajamouli : అసలు నా మొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకోలేదు

ఎస్ఎస్ రాజమౌళి డైరెక్టర్ గా తన మొదటి సినిమా తీసింది  స్టూడెంట్ నెంబర్ వన్. జూనియర్ ఎన్టీఆర్ తో. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. కానీ.. తన మొదటి సినిమాను రాజమౌళి ఎన్టీఆర్ తో తీయాలనుకోలేదట. కాకపోతే.. తన గురువు రాఘవేంద్రరావు.. తారక్ ను తీసుకోవాలని చెప్పడంతో ఆ సినిమా ఒప్పుకున్నాడట. కాకపోతే.. సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యాక.. జూనియర్ ఎన్టీఆర్ లో ఉన్న నటన టాలెంట్ ను గుర్తించి.. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగిందట.

tollywood director ss rajamouli about his films
tollywood director ss rajamouli about his films

ఇలా తన సినిమాల గురించి మాట్లాడిన రాజమౌళి.. తన సినిమాలపై హాలీవుడ్ సినిమా ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. తను సినిమాలకు రాకముందు హాలీవుడ్ సినిమాలు బాగా చూసేవారట. అప్పుడే అనుకునేవారట.. అసలు తెలుగు సినిమాలు ఎందుకు హాలీవుడ్ రేంజ్ లో ఉండటం లేదు.. అని చాలా బాధపడేవారట. అందుకే.. తన సినిమాలపై హాలీవుడ్ సినిమాల ప్రభావం ఉందంటున్నారు. తన కొన్ని సినిమాల్లో హాలీవుడ్ సీన్స్ ను కూడా వంద శాతం కాపీ చేశానని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజమౌళి.

ఇది కూడా చ‌ద‌వండి ==> Sri Reddy : జగన్ గారు మీరే నన్ను ఆదుకోవాలి.. డబ్బుల కోసమే ఆ వీడియోలు చేస్తున్నానంటున్న శ్రీరెడ్డి?

ఇది కూడా చ‌ద‌వండి ==> Tollywood : స్క్రీన్ మీద సొంత అక్కా చెల్లెళ్ళుగా నటించిన 11 మంది స్టార్ హీరోయిన్స్ వీరే

ఇది కూడా చ‌ద‌వండి ==> Jabardasth Varsha : జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, వర్ష పెళ్లి ఫిక్స్.. ఇదిగో పెళ్లి కార్డు?

ఇది కూడా చ‌ద‌వండి ==> Jabardasth : జబర్దస్త్ తో పాటు.. యూట్యూబ్ చానెల్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న కమెడియన్లు వీళ్లే?

Advertisement
Advertisement