Tollywood Young Hero : ఆ హీరో పారితోషికం వద్దన్నా కూడా సినిమాలు చేసేవారు లేరట!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 27 August 2022, 9:20 pm

Tollywood Young Hero : టాలీవుడ్ లో రెండు మూడు సంవత్సరాల క్రితం వరకు ఆ హీరో క్రేజీ యంగ్ హీరోల్లో ముందు వరసల్లో ఉండేవాడు. ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. దాంతో ఆయన ఒకానొక సమయంలో రూ. 5 నుండి రూ. 7 కోట్ల వరకు పారితోషకాన్ని దక్కించుకున్నాడు. ఆయనతో సినిమాలను చేసేందుకు పలువురు నిర్మాతలు మరియు దర్శకులు కూడా క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనాకు ముందు ఆయన నటించిన సినిమాలు రెండు మూడు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. కరోనా సమయంలో కూడా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్రంగా నిరాశపరిచాడు.

ఇక ఈమధ్య ఆయన ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశపరిచాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్లాప్ అవుతుండడంతో ఆయన సినిమాలు ముందు ముందు కూడా ఆకట్టుకునే అవకాశం లేదని కొందరు భావిస్తున్నారు. దాంతో ఆయనకు అవకాశాలు రావడం అనేది పెద్ద విషయంగా మారిపోయింది. ప్రముఖ నిర్మాతలు ఆయనకు ముఖం చాటేస్తుంటే.. చిన్న నిర్మాతలు కూడా ఆయనను పట్టించుకోవడం లేదు. గతంలో ఆయన వెంటపడిన దర్శకులు ఇప్పుడు ఆయనతో సినిమా అంటే దండం పెట్టి పక్కకు పోతున్నారు. నీతో సినిమా అంటే నిర్మాతలు ఓకే చెప్పే అవకాశం లేదు, అందుకే నీతో సినిమా చేయలేమంటూ మొహాన్ని చెప్పేస్తున్నారంట. దాంతో ఆ హీరో పారితోషికం లేకుండానే సినిమాను చేస్తాను, సినిమా హిట్ అయితే కొంత మొత్తం పారితోషకం ఇవ్వండి అంటూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాడట.

tollywood young hero facing problems in his film career

tollywood young hero facing problems in his film career

ఆ యంగ్ హీరో అంత పెద్ద ఆఫర్‌ ఇచ్చినా కూడా నిర్మాతలు ఆయన పై బడ్జెట్ పెట్టేందుకు భయపడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో మినిమంగా ఏడు నుండి 10 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయాల్సి ఉంది. ఆ బడ్జెట్ తో ఆయనపై సినిమా తీస్తే కనీసం ఐదారు కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కనుక ఆయనతో సినిమా తీయడం కంటే ఊరుకోవడం ఉత్తమం అంటూ నిర్మాతలు భావిస్తున్నారట. టాలీవుడ్లో ఓడలు బండ్లు… బండ్లు ఓడలు అవ్వడం అనేది రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ హీరో పరిస్థితి అలాగే ఉంది. ఇంతకు ఆ హీరో ఎవరు అనేకదా మీ ఆలోచన.. ఈ ఏడాది ఆరంభంలో ఆ హీరో నటించిన ఒక సినిమా విడుదల అయ్యి ఫ్లాప్ అయింది. కాస్త గట్టిగా ఆలోచిస్తే ఆ హీరో ఎవరో మీకే అర్థమవుతుంది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Spider Man Brand New Day Movie Review : స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  2. "Gold Rate Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. జూలై 30న తగ్గిన తాజా ధరలు"

  3. "Srinivasa Mangapuram Movie Review : శ్రీనివాస మంగాపురం మూవీ రివ్యూ అండ్ రేటింగ్‌..!"

  4. "Telangana Police Jobs : బిగ్ బ్రేకింగ్‌.. నిరుద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్.. 7,437 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల!"

  5. "Mrunal Thakur : 24 ఏళ్ల క్రికెటర్‌తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉందా? ఒక్క వీడియోతో సోషల్ మీడియా షాక్!"

  6. "Bhogapuram Airport : భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్రకు గోల్డెన్ ఫ్యూచర్.. ప్రపంచానికి కొత్త గేట్‌వే!"

  7. "Ys Jagan : వైఎస్‌ జగన్ టేబుల్ మీద సంచలన REPORT FILE.. ఓపెన్ చేయగానే బిత్తరపోయాడు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి