Tollywood Young Hero : పెళ్లి అయ్యి రెండేళ్లు కాకుండానే విడాకులకు సిద్దం అయిన యంగ్ హీరో.. ఆ హీరోయిన్ కారణమా?
Tollywood Young Hero : టాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రస్తుతం స్టార్ గా నిలిచాడు. యంగ్ హీరోల్లో ఆయన ఒకరు. అలాంటి యంగ్ హీరో ఇప్పుడు వ్యక్తిగత విషయాల కారణంగా వార్తల్లో ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.. అంతే కాకుండా వరుసగా సక్సెస్ లను కూడా దక్కించుకుంటున్నాడు. దాంతో ఆ యంగ్ హీరో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. హీరోగా కెరీర్ బాగున్నా కూడా వ్యక్తిగతంగా మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఆ యంగ్ హీరో ఇప్పుడు విడాకులకు సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.
హీరోగా ఆయన నటించిన రెండు సినిమాల్లో ఒక హీరోయిన్ నటించింది. ఆ హీరోయిన్ తో ఈ యంగ్ హీరో ప్రేమాయణం సాగిస్తున్నాడట. ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. దాంతో భార్య కు విడాకులు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడట. దాదాపు ఆరు నెలలుగా యంగ్ హీరో మరియు ఆయన భార్య వేరు వేరుగా ఉంటున్నారు. భర్త నుండి విడాకులు కావాలని ఆమె కూడా కోరుకుంటుంది అంటూ ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఆ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో మాదిరిగా టాలీవుడ్ లో కూడా విడాకులు కామన్ అయ్యాయి.
చాలా మంది యంగ్ హీరోలు మరియు హీరోయిన్స్ విడాకులు తీసుకున్నారు.. తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. కొందరు ఈ విడాకుల భయానికి కనీసం పెళ్లి కూడా చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ యంగ్ హీరో మాత్రం హీరోయిన్ తో మోజు లో ఉండి పెళ్లిని పెటాకులు చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. త్వరలోనే ఆ హీరో ఎవరు.. ఆ హీరోయిన్ ఎవరు అనే విషయం బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మేము ఆ పేర్లను చెప్పాలి అనుకోవడం లేదు. ఆ హీరో ఇప్పటికి అయినా హీరోయిన్ ప్రేమ నుండి బయట పడి భార్య తో సంతోషంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం.