Pushpa 2 The Rule Business : పుష్ప‌2 బిజినెస్ రికార్డ్.. వాట‌న్నింటిని దాటేస్తూ సంచ‌ల‌నం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa 2 The Rule Business : పుష్ప‌2 బిజినెస్ రికార్డ్.. వాట‌న్నింటిని దాటేస్తూ సంచ‌ల‌నం

 Authored By ramu | The Telugu News | Updated on :4 December 2024,4:00 pm

Pushpa 2 The Rule Business : పుష్ప2.. పుష్ప2.. పుష్ప2.. ప్రస్తుతం ఇండియా మొత్తం ఈ నామ‌మే జ‌పం చేస్తుంది. డిసెంబ‌ర్ 5న విడుద‌ల కానున్న ఈ సినిమా కి సంబంధించిన‌ డిసెంబర్ 4న రాత్రి నుంచే షోలు మొదలవుతున్నాయి. టిక్కెట్ రేట్‌లు ఎంతున్నాయని పక్కన పెడితే.. టిక్కెట్‌‌లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుక్ మై షో ఓపెన్ చేస్తే చాలు.. చాలా థియేటర్‌లలో సోల్డ్ అవుట్‌లే కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. సినిమాపై ఏ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే.. రూ.1000 కోట్లేంటి.. రూ.2000 కోట్లయిన కొట్టే బొమ్మ అని అనిపిస్తుంది. ఈ సినిమా బిజినెస్ ఓవరాల్‌గా రూ. 621కోట్లు జరిగింది. టాలీవుడ్ చరిత్రలోనే రూ.500 కోట్లు బిజినెస్ జరుపుకున్న ఫస్ట్ సినిమా ఇదే.

Pushpa 2 The Rule Business పుష్ప‌2 బిజినెస్ రికార్డ్ వాట‌న్నింటిని దాటేస్తూ సంచ‌ల‌నం

Pushpa 2 The Rule Business : పుష్ప‌2 బిజినెస్ రికార్డ్.. వాట‌న్నింటిని దాటేస్తూ సంచ‌ల‌నం

Pushpa 2 The Rule Business పుష్ప రీ సౌండ్..

టాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే… ముందుగా పుష్ప‌2 -617 కోట్లు, ఆర్ఆర్ఆర్ -451 కోట్లు, క‌ల్కి- 370 కోట్లు, బాహుబ‌లి2- 352 కోట్లు, సాహో- 270 కోట్లు, ఆదిపురుష్‌- 240 కోట్లు, రాధే శ్యామ్- 202.80 కోట్లు, సైరా-187.25 కోట్లు, దేవ‌ర పార్ట్ 1- 182.55 కోట్లు, పుష్ప పార్ట్ 1-144.9 కోట్లు, గుంటూరు కారం -132 కోట్లు, ఆచార్య‌-131.20 కోట్లు స్పైడ‌ర్- 124.3 కోట్లు, అజ్ఙ‌త‌వాసి- 123.6 కోట్లు బిజినెస్ జ‌రిగింది. అంటే అన్ని సినిమాల క‌న్నా కూడా పుష్ప‌2 ఎపిక్ రికార్డ్ సాధించింది. రూ. 500 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన ఈ సినిమాను త్రీడీ, ఐమాక్స్ వెర్ష‌న్‌లో 12 వేల స్క్రీన్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 పై తారా స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ చిత్ర బృందం మరింత హైప్‌ పెంచుతోంది.

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కోసం ఏకంగా.. రూ.1300 కోట్లకు పైగా గ్రాస్‌ను కలెక్ట్ చేయాలి. ఈ మూవీ కోసం యావత్ ఇండియా సినీ లవర్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. దానికి తోడు టీజర్, ట్రైలర్, పాటలు ఇలా ప్రతీది సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోతున్నాయి. మరోవైపు సినిమా దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్‌లతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నారు. పుష్ప2 కోసం డిస్ట్రిబ్యూటర్‌లు 6 షోలు వేయాలని డిమాండ్ చేస్తున్నారంటే పుష్పగాడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక మరి కొద్ది గంట‌ల‌లోనే పుష్పగాడి రీ సౌండ్ దేశమంతటా వినిపిస్తుంది. top10 movies business in pushpa 2 the rule records , Allu Arjun ,

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది