Trisha : ప్రముఖ నిర్మాత తో త్రిష పెళ్లి ఫిక్స్ .. ఇద్దరి మధ్య సీక్రెట్ లవ్..!

Advertisement

Trisha : ‘ నీ మనసు నాకు తెలుసు ‘ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన త్రిష ‘ వర్షం ‘ సినిమాతో బ్రేక్ అందుకుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ బ్యూటీ ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. పదేళ్లకు పైన ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఇప్పటికీ సినిమాలు చేస్తూ త్రిష సౌత్ లోనూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఈ బ్యూటీ వ్యక్తిగతంగా చాలా ఫెయిల్యూర్ లను ఎదుర్కొంది. తాజాగా ఆమె పెళ్లి గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి.

Advertisement

అయితే ఆమె హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తమిళ నిర్మాత, యువ వ్యాపారవేత్త వరుణ్ మనియన్ తో త్రిష పెళ్లి ఖరారు అయింది. వీరిద్దరి ఎంగేజ్మెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ తర్వాత అనివార్య కారణాలతో వీళ్ళ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్లలేదు. ఇది జరిగిన కొంతకాలానికి త్రిష కెరీర్ను స్టార్ట్ చేసింది. సినిమాలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్న ఆమె క్రేజ్ ఇంకా తగ్గలేదు. ఇక ఇటీవల ఆమె వేగంగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్‌తో ‘లియో’ చేస్తుంది. అలాగే, ‘ది రోడ్’, ‘విడా ముయార్చి’, ‘సత్తురంగా వెట్టై 2’ వంటి తమిళ చిత్రాలు చేస్తోంది. అంతేకాదు, ‘రామ్ పార్ట్ 1’, ‘ఐడెంటిటీ’ అనే మలయాళ మూవీల్లోనూ నటిస్తోంది.

Advertisement
Trisha krishnan marriage news
Trisha krishnan marriage news

తన ఏజ్ హీరోయిన్ లంతా పెళ్లి చేసుకున్నారు కానీ త్రిష ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు చాలా ఇంటర్వ్యూలలో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు వచ్చాయి. అయితే తాజాగా త్రిష పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ బ్యూటీ మలయాళ పరిశ్రమకు చెందిన నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందట. వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల నుంచి సినిమా చేస్తున్న సమయంలో ప్రేమ చిగురించిందని, త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకొని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని టాక్.

Advertisement
Advertisement