Home » Entertainment » Trivikram Gives Key Role To Mohan Babu
Entertainment

Trivikram : ఇద్ద‌రు బాబులతో త్రివిక్ర‌మ్ స‌రికొత్త ప్ర‌యోగం.. ఫ్యాన్స్‌కి ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్..!

Authored By
Sam C
The Telugu News | Published on: June 27, 2022, 7:30 pm
Advertisement

Trivikram: మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచ‌డంలో చాలా ఎక్స్‌ప‌ర్ట్. త్వ‌ర‌లో మ‌హేష్ బాబుతో క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. అయితే ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ బాబు -త్రివిక్రమ్ ద‌ర్శకత్వంలో కొత్త సినిమా చేస్తుండ‌డం అంద‌రిలో ఆస‌క్తిని క‌లిగిస్తుంది. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీలో మహేష్ బాబు తండ్రి పాత్రలో కన్నడ స్టార్ హీరో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది.

Advertisement

సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే దాదాపు ఫైనల్ అని అన్నారు. కాని వేరే హీరోయిన్ కోసం వెతుకుతున్న‌ట్టు తెలుస్తుంది. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటికే అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఇప్పటి వరకు హీరోగా తన కెరీర్‌లో ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం.

trivikram gives key role to mohan babu

Advertisement

Trivikram : మాంత్రికుడి ప‌క్కా స్కెచ్..

అయితే ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ఖ‌లేజా సినిమా కూడా విడుద‌లై ప‌దేళ్లు దాటేసింది. చాలా కాలం త‌ర్వాత వీరిద్ద‌రూ క‌లిసి చేస్తోన్న సినిమా కావ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. త్రివిక్ర‌మ్ ఈ సినిమా కోసం స్టార్ న‌టీనటుల‌ను లైన్‌లో పెడుతున్నార‌ట‌. ఇప్ప‌టికే విజ‌య్ సేతుప‌తి, ఫ‌హాద్ ఫాజిల్‌, పృథ్వీరాజ్ సుకుమార్.. ముగ్గురిలో ఒక‌రు మ‌హేష్‌కి విల‌న్‌గా న‌టిస్తార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మ‌రో సీనియ‌ర్ న‌టుడు, న‌టి కూడా ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నారంటూ టాక్‌. మ‌హేష్ అంకుల్ పాత్ర‌లో మోహ‌న్ బాబు క‌నిపించ‌బోతున్నార‌ట‌. త్రివిక్ర‌మ్ ఆయ‌న పాత్ర‌ను డిఫ‌రెంట్ ప్లాన్ చేస్తున్నార‌ని సినీ సర్కిల్స్ అంటున్నాయి. అలాగే సీనియ‌ర్ న‌టి శోభ‌న కూడా ఈ సినిమాలో న‌టించ‌నుంద‌నే స‌మాచారం వినిపిస్తోంది

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి